Puneeth Raj Kumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం ఎందరినో కలచివేసింది. ఆయన పనుల ద్వారా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. తాజాగా ఆయనపై ఆ రాష్ట్ర అటవీ అధికారులు(Forest officials) అభిమానాన్ని చాటుకున్నారు. శివమెుగ్గ(Shivamogga)లోని సక్రెబైలు(Sakrebailu) ఏనుగు శిబిరంలో రెండేళ్ల వయసున్న గున్న ఏనుగుకు పునీత్ (Puneeth Rajkuma) పేరు పెట్టి తమదైన శైలిలో నివాళులర్పించారు.
Also Read: Shiva Rajkumar: 'మీకు నేను ఉన్నా అన్న'’ Jr NTR..మీడియాతో పంచుకున్న శివరాజ్ కుమార్
పునీత(Puneeth Raj Kumar) తన మరణానికి ముందు ఏనుగు శిబిరాన్ని సందర్శించినట్లు అటవీశాఖ డిప్యూటీ కన్జర్వేటివ్ అధికారి నాగరాజు తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో ఓ డాక్యుమెంటరీ షూటింగ్‌లో భాగంగా.. సుమారు రెండు గంటలకుపైగా ఈ గున్న ఏనుగు(Elephant)తో పునీత్ సరదాగా గడిపినట్లు చెప్పారు. ఈ శిబిరాన్ని పునీత్ చివరిసారిగా సెప్టెంబర్‌లో సందర్శించారు. అయితే ఆయన ఆకస్మిక మరణంతో తీవ్ర దిగ్బ్రాంతి చెందిన ఆటవీ సిబ్బంది ఈ గున్న ఏనుగుకు పునీత్ పేరు పెట్టాలని కోరినట్లు చెప్పారు. ఈ మేరకు గజరాజుకు పునీత్ పేరు పెట్టినట్లు తెలిపారు. సాధారణంగా ఇక్కడ ఏనుగుల పిల్లలకు దేవతల పేర్లు పెడతాం. కానీ పునీత్ పేరు పెట్టడం తమకు సంతోషాన్ని కలిగిస్తోందని నాగరాజ్ అన్నారు.
#WATCH | Karnataka: The Forest Department has named a two-year-old elephant calf at Sakrebailu elephant camp near Shivamogga after actor Puneeth Rajkumar, who passed away recently. pic.twitter.com/RtHdJ1hRVU
— ANI (@ANI) November 13, 2021
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook