Edible Oil Price Reduced: ఇటీవలే పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో సామాన్యులకు ఊరట కలిగించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మరో తీపికబురు చెప్పింది. దేశవ్యాప్తంగా వంట నూనె ధరలు తగ్గించననున్నట్లు పేర్కొంది. దీంతో వంట నూనె ధరలు లీటరుకు రూ.7 నుంచి రూ.20 వరకు తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫుడ్ సెక్రటరీ సుధాన్షు పాండే తాజాగా ఈ విషయాన్ని వెల్లడించారు. పామ్ ఆయిల్, వేరుశనగ నూనె, సోయాబిన్ నూనె, సన్‌ఫ్లవర్ నూనె వంటి వాటి ధరలు తగ్గనున్నాయని పేర్కొన్నారు.
అంతేకాకుండా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. క్రూడ్ ఫామ్ ఆయిల్, క్రూడ్ సోయాబిన్, క్రూడ్ సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై బేసిక్ డ్యూటీని 2.5 శాతం నుంచి సున్నాకు తగ్గించింది. అలాగే వీటిపై అగ్రి సెస్‌లో కూడా 20 శాతం నుంచి 7.5 శాతానికి కోత విధించింది. అలాగే రిఫైన్డ్ ఆయిల్స్‌పై బేసిక్ డ్యూటీని 32.5 శాతం నుంచి 17.5 శాతానికి తగ్గించింది. దీంతో వంట నూనె ధరలు మరింత తగ్గనున్నాయి.
Also Read: Fuel Price Cut: భారీగా దిగొచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ప్రస్తుత రేట్లు ఇవే..
Also Read: ONGC: చమురు, ఆయిల్ కంపెనీలు ప్రైవేట్‌పరం కానున్నాయా, ఓఎన్జీసీ ప్రైవేటీకరణకు ప్రయత్నాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook