RRR movie pre-release event in Dubai ?: ఆర్ఆర్ఆర్ సినిమా అంటేనే బాహుబలి మూవీని గుర్తుకుచేసే ఓ భారీ బడ్జెట్ ఎపిక్ ప్రాజెక్ట్. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Ram Charan, Jr Ntr), బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్, ఆలియా భట్‌తో పాటు మరెంతో మంది సినీ ప్రముఖులను సింగిల్ ఫ్రేమ్‌పై చూపించే మల్టీస్టారర్ మూవీ ఇది. ఆర్ఆర్ఆర్ మూవీ ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని టాలీవుడ్ టూ బాలీవుడ్.. అన్నివర్గాల ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు.
వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో ఉన్న ఆర్ఆర్ఆర్ మూవీ జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఆర్ఆర్ఆర్ మూవీ విడుదల సమీపిస్తున్న తరుణంలో మూవీ యూనిట్ ప్రమోషన్స్‌పై దృష్టిసారించింది. అందులో భాగంగానే ఈ నెల 29వ తేదీన ఆర్ఆర్ఆర్ మూవీ టీజర్ (RRR teaser release date) విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
తాజాగా ఫిలింనగర్ వర్గాలు చెప్పుకుంటున్న సమాచారం ప్రకారం ఆర్ఆర్ఆర్ మూవీ ప్రి-రిలీజ్ ఈవెంట్‌ని దుబాయ్‌లో గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ మూవీని వరల్డ్ వైడ్‌గా తెలుగు, తమిళ, కన్నడ, మళయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్న నేపథ్యంలో వరల్డ్ వైడ్‌గా ఉన్న ఆడియెన్స్ దృష్టి ఆకర్షించే పథకంలో భాగంగానే దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఫిలింనగర్ టాక్.
Also read : Samantha: ఆ లింక్స్ వెంటనే తొలగించండి.. పర్సనల్ పోస్టులు చేయకంటూ సమంతకు కోర్టు హితవు
దుబాయ్‌లో జరిగే ఆర్ఆర్ఆర్ మూవీ (RRR movie teaser updates) ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఒక్కో భాష నుంచి ఒక్కో స్టార్ హీరోను చీఫ్ గెస్టుగా ఆహ్వానించనున్నట్టుగానూ ఫిలింనగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఫిలింనగర్లో జరుగుతున్న ఈ ప్రచారం సంగతి ఇలా ఉంటే, ఇప్పటివరకు ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సెలబ్రేషన్స్‌పై (RRR movie pre-release event in Dubai) ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
Also read : Varun Tej Ghani Movie: వరుణ్ తేజ్ 'గని' సినిమా సాంగ్ ప్రోమో చూశారా ?
Varun Doctor Movie OTT: ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైన శివకార్తికేయన్ 'వరుణ్ డాక్టర్'
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook