Pakistan Vs New Zealand: ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న పాకిస్తాన్‌ను న్యూజిలాండ్‌ నిలువరించగలదా..??

మంగళవారం టీ 20 ప్రపంచకప్ లో పాకిస్తాన్‌- న్యూజిలాండ్‌ మధ్య జరగనున్న మ్యాచ్ మరింత రసవత్తరంగా మారబోతుందని తెలుస్తుంది. చివరి నిమిషంలో పాకిస్తాన్ టూర్ రద్దు చేసుకున్న న్యూజిలాండ్‌ జట్టుపై ప్రతీకారం తీర్చుకోవాలని పాకిస్తాన్ జట్టు భావిస్తుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 26, 2021, 04:20 PM IST
  • ఆఖరి నిమిషంలో టూర్ రద్దు చేసుకున్న న్యూజిలాండ్‌ జట్టు
  • ఈ టోర్నీలో న్యూజిలాండ్‌ పై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్న పాక్
  • భారత్ పై విజయంతో దూకుడుమీదున్న పాకిస్తాన్
Pakistan Vs New Zealand: ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న పాకిస్తాన్‌ను న్యూజిలాండ్‌ నిలువరించగలదా..??

T20 World Cup 2021 Pakistan Vs New Zealand: టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా మంగళవారం రోజున షార్జాలో జరగనున్న పాకిస్తాన్‌ (Pakistan)- న్యూజిలాండ్‌ (New Zealand) రసవత్తరంగా మారనుంది. ఆటగాళ్ల భద్రత ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని టూర్ రద్దు నిర్ణయాన్ని తీసుకున్నామని న్యూజిలాండ్‌ క్రికెట్ బోర్డు (New Zealand Cricket Board) వెల్లడించింది. అయితే అక్టోబర్ నెలలో ఇంగ్లండ్‌ (England) మహిళల మరియు పురుషుల జట్లు పాకిస్థాన్ (Pakistan) లో పర్యటించాల్సి ఉంది. కానీ న్యూజిలాండ్‌ క్రికెట్ బోర్డు లాగానే ఇంగ్లండ్‌ క్రికెట్ బోర్డు (England Cricket Board) కూడా ఈ రెండు టూర్ లను రద్దు చేసుకుంటున్నట్టు వెల్లడించింది.  

చివరి నిమిషంలో పాకిస్తాన్ టూర్ రద్దు కారణంగా ప్రపంచ దేశాల ముందు వారి ప్రఖ్యాతి దిగజారటమేకాకుండా, తీవ్ర నష్టం వచ్చినట్టు, ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో ఎలాగైనా న్యూజిలాండ్‌  జట్టును ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని పలువురు పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లు పాకిస్తాన్ క్రికెట్ జట్టును సూచించారు. 

Also Read: Bank Holidays in November: న‌వంబ‌ర్‌లో 17 రోజులు బ్యాంకులకు సెలవులంటా.. అన్ని రాష్ట్రాలకు కాదండోయ్!

అయితే వరల్డ్ కప్ (World Cup) ప్రారంభానికి ముందే పాకిస్తాన్ మాజీ పేస్ బౌలర్ షోయబ్‌ అక్తర్‌ (Shoaib Akhtar) బహిరంగంగానే ఈ విషయంపై ప్రకటన చేశారు. మొదటి మ్యాచ్ లోనే భారత్ (Team India)పై అన్ని విధాలా ఆధిపత్యం చెలాయించి.. చరిత్రను తిరగరాసిన బాబర్ అజామ్ (Babar Azam) జట్టు ఎలాగైన న్యూజిలాండ్‌ జట్టుపై గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంది. టీమిండియాపై చారిత్రాత్మక విజయంతో కెప్టెన్ బాబర్ పై మరియు ఆ జట్టుపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ పరిస్థితి చూస్తుంటే..  మంగళవారం జరగబోయే పాకిస్థాన్ Vs న్యూజిలాండ్‌ (Pakistan Vs New Zealand)మ్యాచ్ మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉందని తెలుస్తుంది. 

Also Read: Snake Hair Band: హెయిర్ బ్యాండ్‌గా బతికున్న పాము.. ఇదెక్కడి ఫ్యాషన్ అంటున్న నెటిజన్లు

ఇప్పటి వరకు పాకిస్తాన్‌- న్యూజిలాండ్‌ 24 టీ20 మ్యాచ్‌లలో తలబడగా..పాకిస్తాన్‌ 14 మ్యాచ్‌లలో విజయం సాధించగా.. న్యూజిలాండ్‌ 10 మ్యాచ్‌లు గెలిచింది. ఇక టీ20 వరల్డ్‌కప్‌ విషయానికి వస్తే.. 5 సార్లు తలబడగా.. పాకిస్తాన్ 3 మ్యాచ్‌లలో గెలుపొంది ముందంజలో ఉండగా.. న్యూజిలాండ్‌ 2 మ్యాచ్‌లలో గెలిచి గెలిచి వెనకబడింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News