Hyderabad Traffic diversion for TRS plenary on Oct 25 and Grand arrangements in place for TRS plenary: టీఆర్ఎస్ ప్లీనరీకి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు సాగుతున్నాయి.. హైదరాబాద్‌లోని (Hyderabad) హైటెక్స్ వేదికగా అక్టోబర్ 25, సోమవారం జరిగే ప్లీనరీ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ ప్రతినిధులతో పాటు మొత్తం ఆరు వేల మంది దాకా తరలిరానున్నారు. పార్లమెంట్ సమావేశాలు, కరోనా (Corona) కారణంగా మూడేళ్ల పాటు ప్లీనరీ సమావేశాలు జరగలేదు. దీంతో ఈ సారి గులాబీ శ్రేణులు (TRS leaders) భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇక ఈ సమావేశాల్లో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. ఈసారి కూడా కేసీఆర్‌ను (KCR) పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవడం లాంఛనం కానుంది.
ఇక హైటెక్స్‌లో (Hitex) టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ (TRS plenary) సమావేశం నేపథ్యంలో ఆ రోజు ఐటీ కారిడార్ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. సమావేశానికి రాష్ట్ర నలుమూలల నుంచి అధిక సంఖ్యలో ప్రముఖులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరవుతుండటంతో హైటెక్స్ పరిసరాలలో భారీగా ట్రాఫిక్ (Traffic) రద్దీ ఏర్పడే అవకాశాలున్నాయని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు. ఈ మేరకు ప్రజలకు పలు సూచనలు చేశారు.
Also Read : India vs Pakistan T20 World Cup Match: పాక్‌తో తొలిపోరు నేడే, టీమ్ ఇండియా తుది జట్టు
ట్రాఫిక్ డైవర్షన్ (Traffic diversion) ఇలా ఉండనుంది. నీరూజ్ జంక్షన్ నుంచి సైబర్ టవర్స్ మీదుగా గచ్చిబౌలి జంక్షన్ వైపు వెళ్లే వెహికల్స్.. అయ్యప్ప సొసైటీ సీవోడీ జంక్షన్, దుర్గం చెరువు, (Durgam Cheruvu Hyderabad) ఇనార్బిట్ మాల్, (Inorbit Mall) ఐటీసీ కొహినూర్, ఐకియా, బయోడైవర్సిటీ జంక్షన్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
మియాపూర్, కొత్తగూడ, హఫీజ్‌పేట నుంచి సైబర్ టవర్స్ మీదుగా జూబ్లీహిల్స్ వైపు వెళ్లే వెహికల్స్.. రోలింగ్ హిల్స్, ఏఐజీ హాస్పిటల్, ఐకియా, ఇనార్బిట్ మాల్, దుర్గం చెరువు నుంచి జూబ్లీహిల్స్‌కి (Jubileehills) చేరుకోవాలి. ఆర్సీపురం, చందానగర్, కొండాపూర్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లే వారు బీహెచ్ఈఎల్, నల్లగండ్ల, హెచ్‌సీయూ, ఐఐఐటీ మీదుగా జర్నీ చేయాల్సి ఉంటుంది.
Also Read : India Vs Pakistan: టీమిండియాపై గెలిస్తే పాకిస్తాన్ క్రికెటర్లకు బ్లాంక్ చెక్: రమీజ్
ఇక ప్లీనరీ ఏర్పాట్లను మంత్రి కేటీఆర్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్లీనరీకి వచ్చే టీఆర్ఎస్ నేతలంతా గులాబీ దుస్తులను ధరించి రావాలని మంత్రి కేటీఆర్ (KTR) ప్రత్యేకంగా కోరడం ఆసక్తిని రేపుతోంది. టీఆర్ఎస్ అధ్యక్ష పదవీకి గతంలో మాదిరిగానే ఈసారి ఒకే ఒక నామినేషన్ దాఖలైంది. దీంతో పదోసారి కూడా కేసీఆరే (KCR) ఆపార్టీ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం లాంఛనంగా కన్పిస్తోంది. దీనిలో భాగంగానే ప్రముఖ శాండ్ ఆర్టిస్ట్ కాంత్ రిసా 20మీటర్ల వెడల్పు కాన్వాస్‌పై ఇరవై ఏళ్ల టీఆర్‌ఎస్ ప్రస్థానాన్ని వివరిస్తూ చిత్రాలను గీయనున్నారు. ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభం అయ్యాయి.
అదేవిధంగా కోట గుమ్మాన్ని తలపించేలా భారీ ప్రవేశ ద్వారాన్ని ఏర్పాటు చేయనున్నారు. వివిధ రకాల థీమ్‌లతో ఎల్‌ఈడీ ధగధగలు, కళ్లకు కట్టినట్లు చూపేలా వేలాది ఫొటోలతో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) జీవిత చరిత్రను చూపించనున్నారు. టీఆర్ఎస్ (TRS) ఏడేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
Also Read : Weather update: ఏపీలో నేడు, రేపు మోస్తరు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
TRS plenary : రేపు టీఆర్‌ఎస్ ప్లీనరీ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా అక్టోబర్ 25న టీఆర్ఎస్ ప్లీనరీ
భారీ ఎత్తున్న ఏర్పాట్లు
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
ట్రాఫిక్ డైవర్షన్ గురించి తెలిపిన పోలీసులు