England vs West Indies: టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ అరుదైన రికార్డు

England vs West Indies: T20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ కీలక పరిణామాలకు వేదికగా నిలిచింది. అత్యల్ప స్కోరుకే ఆలవుట్ కావడం, మరోవైపు ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ అరుదైన రికార్డు ప్రత్యేకతలుగా ఉన్నాయి. అవేంటో చూద్దాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 24, 2021, 08:38 AM IST
  • టీ20 ప్రపంచకప్ 2021లో అరుదైన రికార్డు
  • వెస్టిండీస్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ అరుదైన రికార్డు
  • కేవలం 2 పరుగులిచ్చి 4 వికెట్లు సాధించిన ఆదిల్ రషీద్
England vs West Indies: టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ అరుదైన రికార్డు

England vs West Indies: T20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ కీలక పరిణామాలకు వేదికగా నిలిచింది. అత్యల్ప స్కోరుకే ఆలవుట్ కావడం, మరోవైపు ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ అరుదైన రికార్డు ప్రత్యేకతలుగా ఉన్నాయి. అవేంటో చూద్దాం.

ఐసీసీ టీ20 వరల్డ్‌కప్(T20 World Cup)టోర్నీ ప్రారంభమైపోయింది. శనివారం జరిగిన ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్(England-West Indies match)మ్యాచ్‌లో చెప్పుకోదగ్గ ప్రత్యేకతలు చోటుచేసుకున్నాయి. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ ఘోరంగా ఓటమి పాలైంది. కేవలం 55 పరుగులకే ఆలవుట్ అవడం ఓ విశేషంగా నిలిచింది. మరోవైపు ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ ఇదే మ్యాచ్‌లో అరుదైన రికార్డు సాధించాడు. 

టీ20 ప్రపంచకప్ 2021(T20 World Cup 2021)మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్(Adil Rashid) టీ20 ప్రపంచకప్‌లో అత్యంత తక్కువ పరుగులు ఇచ్చి ఏకంగా 4 వికెట్ల హాల్ సాధించిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 2 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు సాధించి రషీద్‌ ఈ ఘనత అందుకున్నాడు. అదే విధంగా టీ20 ప్రపంచ కప్‌లో ఒక మ్యాచ్‌లో అత్యంత తక్కువ పరుగులు ఇచ్చిన రెండవ బౌలర్‌గా రషీద్‌ రికార్డులెక్కాడు. అంతకు ముందు శ్రీలంక స్పిన్నర్‌ రంగనా హెరత్‌ కేవలం 3 పరుగులిచ్చి 5 వికెట్లు సాధించాడు.

శనివారం జరిగిన టీ20 వరల్డ్‌కప్ ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్(England-West indies Match)మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 56 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను చేధించింది. ఇంగ్లండ్‌ జట్టులో బట్లర్‌ 24 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టుకు విజయాన్ని అం​దించాడు. విండీస్‌ బౌలర్లలో అకేల్‌ హోసిన్ రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకు ముందు టాస్‌ ఓడి భ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ ఇంగ్లండ్‌ బౌలర్ల ధాటికి కేవలం 55 పరుగులకే కుప్పకూలిపోయింది. విండీస్‌ బ్యాటింగ్‌లో ఒక్క క్రిస్‌‌గేల్‌ తప్ప మరెవరూ సింగిల్‌ డిజిట్‌ స్కోర్‌ దాటలేకపోయారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో రషీద్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా,  టైమల్ మిల్స్‌ ,మొయిన్ అలీ చెరో రెండు వికెట్లు సాధించారు.

Also read: India vs Pakistan T20 World Cup Match: పాక్‌తో తొలిపోరు నేడే, టీమ్ ఇండియా తుది జట్టు ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News