Bathukamma: బుర్జ్ ఖలీఫా స్క్రీన్‌పై తెలంగాణ సంప్రదాయ పండుగ బతుకమ్మ వైభవం

Bathukamma: తెలంగాణ సంప్రదాయం అంతర్జాతీయం కానుంది. తెలంగాణ పండుగ అంతర్జాతీయ వేదిక ఎక్కనుంది. ప్రపంచంలోని ఎత్తైన భవనం సాక్షిగా బతుకమ్మ ఇవాళ ప్రదర్శితం కానుంది. ఆ వివరాలు పరిశీలిద్దాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 23, 2021, 09:44 AM IST
  • ప్రపంచంలోని అతి ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా స్క్రీన్ పై బతుకమ్మ ప్రదర్శన
  • ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో బతుకమ్మ ప్రదర్శనకు ఏర్పాట్లు
  • ఇవాళ రాత్రి 9.40 నిమిషాలకు, 10.40 నిమిషాలకు కార్యక్రమం
 Bathukamma: బుర్జ్ ఖలీఫా స్క్రీన్‌పై తెలంగాణ సంప్రదాయ పండుగ బతుకమ్మ వైభవం

Bathukamma: తెలంగాణ సంప్రదాయం అంతర్జాతీయం కానుంది. తెలంగాణ పండుగ అంతర్జాతీయ వేదిక ఎక్కనుంది. ప్రపంచంలోని ఎత్తైన భవనం సాక్షిగా బతుకమ్మ ఇవాళ ప్రదర్శితం కానుంది. ఆ వివరాలు పరిశీలిద్దాం.

బతుకమ్మ పండుగ(Bathukamma Festival). తెలంగాణ సంప్రదాయ పండుగ. దసరా వేళ తెలంగాణలో జరుపుకున్న అతి పెద్ద పండుగ. తెలంగాణ సంప్రదాయాన్ని ప్రతిబింబించే పండుగ. పూలనే దేవతగా కొలిచ విశిష్ట సంప్రదాయం కలిగిన పండుగ. ఇప్పుడు బతుకమ్మ అంతర్జాతీయ వేదిక ఎక్కనుంది. దుబాయ్ వేదికగా ప్రపంచ దృష్టిని ఆకర్షించనుంది. 

తెలంగాణలోని పూల పండుగ, సంప్రదాయ పండుగైన బతుకమ్మ అంతర్జాతీయం కానుంది. దుబాయ్‌లోని ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనమైన బుర్జ్ ఖలీఫాపై తెలంగాణ సంప్రదాయ పండుగ బతుకమ్మ ప్రదర్శితం కానుంది. ఈ మేరకు ఎమ్మెల్సీ కవిత ఏర్పాట్లు చేసారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్‌పై బతుకమ్మ పండుగ వైభవం ప్రదర్శితం కానుంది. దేశ విదేశాలకు చెందిన లక్షలాదిమంది ఒకేసారి బుర్జ్ ఖలీఫా స్క్రీన్‌పై బతుకమ్మను(Bathukamma on Burj Khalifa Screen) వీక్షించనున్నారు. తెలంగాణ సంస్కృతి, ఖ్యాతిని చాటి చెప్పేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలంగాణ జాగృతి వర్గాలు తెలిపాయి. దుబాయ్‌లో జరిగే ఈ కార్యక్రమంలో తెలంగాణకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, తెలంగాణ జాగృతి నాయకులు, ప్రవాస తెలంగాణ వాసులు పాల్గొననున్నారు. యూఏఈ ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు సైతం హాజరవుతారు. భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 9 గంటల 40 నిమిషాలకు 10 గంటల 40 నిమిషాలకు బుర్జ్‌ ఖలీఫా (Burj khalifa Screen)మీద బతుకమ్మ వీడియో ప్రదర్శితం కానుంది. 

Also readOscar Entry Movies: ఇండియా నుంచి ఆస్కార్ నామినేషన్ ఎంట్రీలు ఆ నాలుగే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News