Pfizer Vaccine: ప్రముఖ అంతర్జాతీయ వ్యాక్సిన్ బ్రాండ్ ఫైజర్ నుంచి శుభవార్త విన్పిస్తోంది. ఆ కంపెనీ అభివృద్ధి చేసిన కోవిడ్ వ్యాక్సిన్ చిన్నారుల్లో అద్భుతంగా పనిచేస్తుందని తేలింది. కంపెనీ చేసిన తాజా అధ్యయనం వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి(Corona Pandemic)నియంత్రణకై వ్యాక్సినేషన్ అమల్లో ఉంది. అయితే దాదాపు ఎక్కడా చిన్నారులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. చిన్నారులకు ఇచ్చే వ్యాక్సిన్‌లు వివిధ దశల్లో అనుమతికై వేచి చూస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో ప్రముఖ అంతర్జాతీయ వ్యాక్సిన్ కంపెనీగా ఉన్న ఫైజర్ నుంచి గుడ్‌న్యూస్ విన్పిస్తోంది. ఆ కంపెనీ అభివృద్ధి చేసిన కోవిడ్ వ్యాక్సిన్ సమర్ధవంతంగా పవి చేస్తోందని తెలిసింది. ఫైజర్ కంపెనీ ఈ మేరకు తాజాగా ఓ అధ్యయం జరిపింది.
ఆ అధ్యయనం ప్రకారం ఫైజర్ వ్యాక్సిన్(Pfizer Vaccine)..5–11 ఏళ్ల వయసు వారిలో 91 శాతం సమర్థవంతంగా పని చేస్తున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. పిల్లలకి కూడా ఈ వ్యాక్సిన్ అత్యంత సురక్షితమేనని తేలింది. ఇప్పటికే 12 ఏళ్ల పైబడిన వారికే అమెరికాలో వ్యాక్సిన్ ఇస్తున్నారు. 5 నుంచి 11 ఏళ్ల వయసు వారికి నవంబర్ నెల నుంచి ఇవ్వడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. క్రిస్మస్ పండుగ నాటికి కరోనా మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేయడానికి జో బైడెన్(Joe Biden)ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. పిల్లల్లో ఫైజర్ వ్యాక్సిన్‌కి సంబంధించిన అధ్యయనం వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచారు. దీనిపై అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్(FDA)సమీక్ష చేసిన తర్వాత పిల్లలకు వ్యాక్సిన్‌ను సిఫారసు చేయనుంది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ టీకాపై తుది నిర్ణయం తీసుకుంటుంది. అమెరికాలో 5–11 ఏళ్ల వయసు మధ్య వారు దాదాపుగా 2.8 కోట్ల మంది ఉంటారు. ఈ వయస్సు చిన్నారులకు సైతం వ్యాక్సిన్ ఇచ్చినప్పుడే..నిర్భయంగా పిల్లలందరూ స్కూళ్లకి వస్తారని తల్లిదండ్రులు అంటున్నారు.
Also read: Corona New Variant: యూకేను ఆందోళన కల్గిస్తున్న కరోనా కొత్త రకం వేరియంట్, అలర్ట్ జారీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook