Gold Price Today: స్థిరంగా బంగారం, వెండి ధరలు, ఇవాళ దేశంలో ధరల వివరాలు ఇలా

Gold Price Today: బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. బంగారం, వెండి ధరలు పెరగడం, తగ్గడం సహజమే. గత కొద్దిరోజులుగా పెరుగుతున్న పసిడి ధరకు తాజాగా బ్రేక్ పడింది. ఇవాళ దేశీయ మార్కెట్‌ల బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 17, 2021, 07:26 AM IST
Gold Price Today: స్థిరంగా బంగారం, వెండి ధరలు, ఇవాళ దేశంలో ధరల వివరాలు ఇలా

Gold Price Today: బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. బంగారం, వెండి ధరలు పెరగడం, తగ్గడం సహజమే. గత కొద్దిరోజులుగా పెరుగుతున్న పసిడి ధరకు తాజాగా బ్రేక్ పడింది. ఇవాళ దేశీయ మార్కెట్‌ల బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

బంగారం ధరల (Gold Price Today)పెరుగుదలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. గత మూడ్రోజుల్నించి పెరుగుతూ వస్తున్న పసిడి ధరల్లో తాజాగా పెరుగుదల కన్పించలేదు. ఇవాళ బంగారం ధరలు తటస్థంగా కొనసాగుతున్నాయి. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్‌లో ఎప్పటికప్పుడు మారుతూ ఉంటోంది. బంగారం, వెండి ధరల్లో పెరుగుదల, తగ్గుదల పరిస్థితిని బట్టి కొనసాగుతోంది. ప్రస్తుతం దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్కెట్లో 47 వేల 70 గా ఉంది. అటు 24 క్యారెట్ల బంగారం ధర 48 వేల 070గా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఉదయం ఆరు గంటల వరకు నమోదైన ధరల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల(Delhi Gold Price today)10 గ్రాముల బంగారం ధర 46 వేల 350 రూపాయలు కాగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 50 వేల 560గా ఉంది.
ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో(Mumbai Gold Price Today) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 47 వేల 70 రూపాయలు కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 48 వేల 70గా ఉంది. తమిళనాడు రాజధాని చెన్నైలో(Chennai Gold Price Today) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 44 వేల 650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 48 వేల 710గా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 46 వేల750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 49 వేల 450గా ఉంది. మరోవైపు బెంగళూరులో(Bengaluru Gold Price Today) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 44 వేల 200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 48 వేల 220 ఉంది. ఇక కేరళలో(Kerala Gold Price Today) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 44 వేల 200 అయితే..24 క్యారెట్ల 10 గ్రాముల ధర 48 వేల 220 రూపాయలుంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు పరిశీలిద్దాం. హైదరాబాద్‌లో(Hyderabad Gold Price Today) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 44 వేల 200 రూపాయలుండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 48 వేల 220 రూపాయలుంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 44 వేల 200 కాగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 48 వేల 220గా ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 44 వేల 200 కాగా, 24 క్యారెట్ల ధర 48 వేల 220గా రూపాయలుంది.

Also read: India Corona Vaccination: వందకోట్ల మైలురాయికి చేరువలో ఇండియా కోవిడ్ వ్యాక్సినేషన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News