Petrol, Diesel Prices Today: పండుగ రోజూ కూడా సామాన్యుడిపై చమురు కంపెనీలు భారం మోపుతూనే ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు(Petrol Price) వరుసగా రెండో రోజూ పెరిగాయి. ఇప్పటికే నూనెలు, వంటగ్యాస్ సహా ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో చమురు ధరల పెంపు నుంచి కనీసం పండగరోజైనా ఉపశమనం లభిస్తుందని ఆశించిన సామాన్యులకు నిరాశే మిగిలింది.
గత మూడు వారాల్లో డీజిల్ ధరలు 17 సార్లు పెరగ్గా.. పెట్రోల్ ధరలు 14 సార్లు ఎగబాకాయి. తాజాగా శుక్రవారం లీటర్ పెట్రోల్ 35 పైసలు, డీజిల్‌పై 36 పైసలు చొప్పున పెరిగాయి. ఈ పెంపుతో దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.14కు, ముంబయిలో రూ.111.09కు చేరుకుంది. లీటర్ డీజిల్ ధర ముంబయిలో రూ.101.78ను, దిల్లీలో రూ.93.87ను తాకింది.
Also Read: Best Electric Scooters: దేశంలోని అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో..
తెలుగు రాష్ట్రాల్లో గరిష్ఠంగా గుంటూరులో లీటర్ పెట్రోల్(Petrol Price in Guntur) ధర రూ.112.04, డీజిల్ రూ.104.44కి చేరింది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్‌పై 31 పైసలు, డీజిల్‌పై 37 పైసలు పెరిగింది. (Petrol Price in Vizag) దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.16, డీజిల్ ధర రూ.102.67కు చేరుకుంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై (Petrol Price today Hyderabad) 37 పైసలు, డీజిల్‌పై 38 పైసలు పెంచుతున్నట్లు చమురు పంపిణీ సంస్థలు ప్రకటించాయి. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.33, డీజిల్ ధర రూ.102.38కి పెరిగింది.
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ చమురు(Crude Oil) బ్యారెల్ ధర 84.64 డాలర్లకు చేరుకుంది. ఈ స్థాయికి చేరడం గత ఏడేళ్లలో ఇదే తొలిసారి. దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు రూ.110 దిశగా వెళుతుంటే.. డీజిల్ ధరలు ఇప్పటికే రూ.100 మార్క్‌ను దాటేశాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook