MAA Elections : సీవీఎల్‌ నరసింహరావు మరో సంచలన నిర్ణయం, ‘మా’ సభ్యత్వానికి, బీజేపీకి రాజీనామా

CVL Narasimha Rao Resigned : మా ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగేందుకు తాను ప్రయత్నం చేస్తున్నానని.. ఒకవేళ అది జరగకపోతే ‘మా’ సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తానని చెప్పారు. అనంతరం కొద్ది సేపటికే మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు సీవీఎల్‌ నరసింహరావు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 8, 2021, 10:58 PM IST
  • ‘మా’ అధ్యక్ష పోటీ నుంచి వైదొగిన సీనియర్‌ నటుడు సీవీఎల్‌ నరసింహరావు మరో నిర్ణయం
  • ‘మా’ సభ్యత్వానికీ, బీజేపీకి ఆయన రాజీనామా
  • హాట్ టాపిక్‌గా మారిన సీవీఎల్‌ నరసింహరావు తీసుకుంటున్న నిర్ణయాలు
MAA Elections : సీవీఎల్‌ నరసింహరావు మరో సంచలన నిర్ణయం, ‘మా’ సభ్యత్వానికి, బీజేపీకి రాజీనామా

MAA Elections 2021 CVL Narasimha Rao Resigned to Movie Artists Association membership: ‘మా’ అధ్యక్ష పోటీ నుంచి వైదొలుగుతూ సంచలన నిర్ణయం తీసుకున్న సీనియర్‌ నటుడు సీవీఎల్‌ నరసింహరావు (CVL Narasimha Rao) ఇప్పుడు మరో నిర్ణయం తీసుకున్నారు. తర్వాత మా ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగేందుకు తాను ప్రయత్నం చేస్తున్నానని.. ఒకవేళ అది జరగకపోతే ‘మా’ సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తానని చెప్పారు. అనంతరం కొద్ది సేపటికే మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు సీవీఎల్‌ నరసింహరావు.

Also Read : MAA Elections 2021 : నరేశ్‌ తవ్విన గుంతలో మంచు కుటుంబం పడిందన్న జీవితారాజశేఖర్‌

‘మా’ (MAA) సభ్యత్వానికీ, బీజేపీకి ఆయన రాజీనామా చేశారు. అయితే ఆయన ఈ నిర్ణయం తీసుకునే ముందు ఈ విధంగా మాట్లాడారు. తాను పరీక్షరాయకముందే ఫెయిల్‌ అయ్యానంటూ బాధపడ్డారు. మా ఎన్నికలకు దివంగత నటులు ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, దర్శకుడు దాసరి నారాయణరావులాంటి పెద్దలందరి ఆశీస్సులు ఉన్నాయన్నారు. మా ఎన్నికలు కచ్చితంగా హాయిగా ముగుస్తాయని చెప్పారు. ఒకవేళ అలా ముగియకపోతే తాను మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌కు (Movie Artists Association) రాజీనామా (Resign) చేస్తా అని చెప్పారు.మాలో సభ్యుడిగా ఉండను అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది సేపటికే ఆయన రాజీనామా చేశారు.

నిర్ణయాలన్నీ ఇప్పుడు హాట్ టాపిక్‌

‘మా’ ఎన్నికల నేపథ్యంలో సీవీఎల్‌ నరసింహరావు మొదటి నుంచి తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌ గా మారాయి. తాను ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నానని మొదట ప్రకటించి తర్వాత సీవీఎల్‌ తన నిర్ణయం మార్చుకున్నాడు. ఇప్పుడేమో మా ఎన్నికలు (MAA Elections) ఏకగ్రీవంగా జరిగేందుకు తాను ప్రయత్నం చేస్తున్నానని.. ఒకవేళ అది జరగకపోతే ‘మా’ సభ్యత్వానికి (Maa membership) రాజీనామా చేస్తానని చెప్పిన కాసేపటికే ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకున్నారు సీవీఎల్‌ నరసింహరావు. మొత్తానికి అక్టోబరు 10న జరిగే మా ఎన్నికల (MAA Elections) నేపథ్యంలో జరుగుతోన్న పరిణామాలన్నీ ఎంతో ఆసక్తికరంగా మారాయి.

Also Read : Aryan Khan's bail plea: ఆర్యన్‌కి షాకిచ్చిన ముంబై కోర్టు.. బెయిల్ పిటిషన్ తిరస్కరణ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News