Low Calorie Snacks: స్నాక్స్ తింటూ త్వరగా బరువు తగ్గాలా..? అయితే ఇవి మీ కోసమే!

స్నాక్స్ అంటే ఇష్టమా..?? బరువు పెరుగుతున్నారని భయమా..?? మరేం పర్వాలేదు.. ఇక్కడ పేర్కొన్న స్నాక్స్ తింటూ మీ శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవచ్చు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 4, 2021, 07:18 PM IST
  • బరువు తగ్గాలి కానీ తింటకుండా ఉండలేకపోతున్నారా?
  • ఈ స్నాక్స్ తింటే తక్కువ క్యాలోరీలు అందించబతాయి.
  • బరువు తగ్గాలి అనుకుంటే నిర్మొహమాటంగా ఇవి తినొచ్చు.
Low Calorie Snacks: స్నాక్స్ తింటూ త్వరగా బరువు తగ్గాలా..? అయితే ఇవి మీ కోసమే!

Low Calorie Snacks: ప్రతి ఒక్కరు ఫిట్ గా ఉంటూ చూడటానికి అందంగా కనపడాలని కోరుకుంటారు, కానీ వీటి కోసం గానూ అనుసరించాల్సిన ఆహార నియమమాలను పాటించటంలో విఫలం అవుతుంటారు. రోజులో తక్కువ మొత్తంలో రోజు ఆహరం తినటం వలన, శరీర బరువు తగ్గటమే కాకుండా, జీవక్రియ రేటును కూడా సరైన స్థాయిలో నిర్వహించబడుతుందని పరిశోధనలలో నిరూపించబడింది. 

శరీర బరువు ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించాలంటే, రోజు 3 సార్లు భోజనంతో పాటూ రెండు సార్లు క్యాలోరీలను తక్కువ అందించే చిరుతిళ్ళను తినటం మంచిది. రోజు ఒకే సమయానికి, 3 సార్లు భోజనం తినటం వలన, జీవక్రియ రేటు సరైన స్థాయిలో నిర్వహించబడుతుంది. అంతేకాకుండా, ఆరోగ్యకర స్నాక్స్ ను తినటం వలన భోజనం ఎక్కువగా తినలేరు. ఫలితంగా, తక్కువ క్యాలోరీలు అందించబడతాయి.

ఇక్కడ తెలిపిన స్నాక్స్ వలన 100 క్యాలోరీల కన్నా తక్కువగా అందించబడి, శరీరానికి కూడా కొవ్వు పదార్థాలు తక్కువ స్థాయిలో అందించబడతాయి.

Also Read: MAA Elections 2021: 'మా' ఎన్నికలతో మాకు ఎలాంటి సంబంధం లేదు: ఏపీ ప్రభుత్వం

పండ్లు
నిజానికి పండ్లను మంచి స్నాక్స్ చెప్పవచ్చు. 100 కన్నా తక్కువ క్యాలోరీలు అందించి, నోటికి మంచి రుచిని అందించి, మీ ఆహారానికి చక్కెర లేని లోటును ఇవి భర్తీ చేస్తాయి. పండ్లు శరీరానికి కావలసిన ఫైబర్ అందిస్తాయి. సిట్రస్ పండ్లు ఆరోగ్యానికి మంచివి అని చెప్పవచ్చు.

బెల్పూరి
బెల్పూరి గురించి దాదాపు అందరికి తెలిసి ఉంటుంది, రైల్వే స్టేషన్ మరియు బస్ స్టాండ్ రోడ్లపై కూడా ఈ రకం స్నాక్స్ లభిస్తాయి. వీటిలో సగం కప్పు మరమరాలను మరియు రోస్టెడ్ బెంగాల్ గ్రామ్ లను కలిపి తయారు చేస్తారు. వీటిలో కత్తిరించిన ఉల్లిపాయ్ ను కలిపి, టమాట, పచ్చి మిరపకాయలు మరియు నిమ్మకాయ రసాన్ని పిండి, తయరు చేస్తారు. వీటి రుచితో మీ రుచి గ్రంధులు సంతృప్తి చెందబడి, క్యాలోరీలో తక్కువగా అందించబడతాయి.

ఇడ్లీ
దక్షిణ భారతదేశంలో ప్రాముఖ్యత పొందిన ఈ రకం వంటకం తక్కువ ఫ్యాట్, అధిక కార్బోహైడ్రేట్లను మరియు ప్రోటీన్లను కలిగి ఉండే మంచి స్నాక్స్ అని చెప్పవచ్చు. ఇడ్లీలు రుచిగా ఉండి, తక్కువ క్యాలోరీలను కలిగి ఉండటమే కాకుండా,  సులభంగా జీర్ణం అవుతాయి. ఇవి గ్లూటెన్ లను కలిగి ఉండవు, కారణం వీటిలో వీట్ ఉండదు. కావున, గ్లూటెన్ విషయంలో సెన్సిటివిటి కలిగిన వారు నిరభ్యంత్రంగా తినవచ్చు. 

Also Read: Viral Dance Video: ATMలో హీరో రాజశేఖర్ స్టెప్పులతో ఇరగదీసిన యువతి.. క్షణాల్లో వీడియో వైరల్!

నట్స్ 
చాలా రకాల నట్స్ లలో అధిక మొత్తంలో మోనోసాచురేటేడ్ ఫ్యాట్ లను కలిగి ఉంటాయి, వీటితో పాటుగా, విటమిన్, ప్రోటీన్ లతో పాటుగా కాల్షియం, కాపర్, జింక్, సెలీనియం మరియు ఫోలేట్ వంటి మినరల్ లను పుష్కలంగా కలిగి ఉంటుంది. నట్స్ నుండి వృక్ష సంబంధిత స్టెరాల్స్ మరియు ఫైబర్ లు అందించబడతాయి. నట్స్ లో ఉండే క్యాలోరీలు మరియు కొవ్వు పదార్థాల వలన కొంత మంది వీటిని తినటానికి భయపడుతుంటారు. కానీ, వీటిని తగిన మోతాదులో తినటం వలన శరీరానికి పోషకాలు అందించబడి, తక్కువ క్యాలోరీలను పొందినవారు అవుతారు.  

వెజిటేబుల్ సలాడ్
పచ్చి కూరగాయలతో తయరు చేసిన సలాడ్ నుండి శరీరానికి తక్కువ స్థాయిలో క్యాలోరీలు అందించబడతాయి, వీటితో పాటుగా తక్కువ కొవ్వు పదార్థాల స్థాయిలను అందించే నిమ్మకాయ, వినెగర్ వంటి వాటితో డ్రెస్సింగ్ చేయండి. సలాడ్ డ్రెస్సింగ్ కోసంగానూ, ఒక చెంచా ఆలివ్ ఆయిల్ కూడా వాడండి. 

దోక్ల
దోక్ల అనేది ఉడికించిన, రుచికరమైన ఆహార మరియు మంచి స్నాక్స్ గా కూడా చెప్పవచ్చు. ఇది గ్రామ (చిక్పీస్)ను పులియబెట్టిన పిండితో చేసిన ఒక ప్రఖ్యాత అల్పాహారంగా చెప్పవచ్చు. కానీ దీనిని, ఫ్రై చేయరాదు. ఉడికించిన వెంటనే తినాలి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News