Pawan Kalyan Controversy: వివాదం రేపుతున్న పవన్ కళ్యాణ్ ప్రసంగం : మంత్రి కన్నబాబు

Pawan Kalyan Controversy: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటన, చేసిన ప్రసంగం వివాదాస్పదమవుతోంది. కులమతాల వర్గీకరణే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ప్రసంగం సాగినట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి కన్నబాబు పవన్‌పై నిప్పుులు చెరిగారు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 3, 2021, 09:31 AM IST
  • జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడిన మంత్రి కన్నబాబు
  • గాంధీ జయంతి నాడు గాడ్సేలా మాట్లాడిన పవన్ ్అంటూ విమర్శలు
  • కుల మతాల వర్గీకరణతో గోతులు తీస్తున్నావా అంటూ మండిపడిన కన్నబాబు
Pawan Kalyan Controversy: వివాదం రేపుతున్న పవన్ కళ్యాణ్ ప్రసంగం : మంత్రి కన్నబాబు

Pawan Kalyan Controversy: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటన, చేసిన ప్రసంగం వివాదాస్పదమవుతోంది. కులమతాల వర్గీకరణే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ప్రసంగం సాగినట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి కన్నబాబు పవన్‌పై నిప్పుులు చెరిగారు.

రోడ్లపై గుంతలు పూడ్చేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan)చేపట్టిన శ్రమదాన కార్యక్రమం వివాదాస్పదమవుతోంది. రాజమండ్రి బాలాజిపేట జంక్షన్‌లో పవన్ చేసిన ప్రసంగంపై విమర్శలు వస్తున్నాయి. కాపు, కమ్మ కులాల్ని వెనకేసుకుని రావడం, ఆ కులాలు కలిసి రావాలని పిలుపునివ్వడం వివాదానికి దారి తీస్తోంది. బైబిల్ పట్టుకుని తిరగడం లేదంటూ వ్యంగ్యంగా మాట్లాడటం ఓ మతాన్ని టార్గెట్ చేయడమేనని ఆరోపిస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ వైఖరిని మంత్రి కన్నబాబు తప్పుబట్టారు. 

రోడ్లపై గుంతలు పూడ్చేందుకు శ్రమదానం(Shramadanam)పేరిట పవన్ కళ్యాణ్ పబ్లిసిటీ స్టంట్ చేశారని మంత్రి కన్నబాబు విమర్శించారు. గాంధీ జయంతి(Gandhi Jayanti) నాడు గాడ్సేలా మాట్లాడారని మండిపడ్డారు. రాజమండ్రిలో రోడ్డుపై 66 సెకండ్లసేపు పారపట్టి..ఫోటోలు, వీడియో షూటింగ్ ముగిశాక నోరు జారి మాట్లాడటంపై మంత్రి కన్నబాబు విరుచుకుపడ్డారు. 66 సెకండ్లపాటు చేసింది శ్రమదానమెందుకవుతుందని ప్రశ్నించారు. గోతులు పూడ్చే వంకతో..కులాల్ని మతాల్ని రెచ్చగొట్టడమే మీ పనా అని విమర్శించారు. గోతులు పూడుస్తున్నారా లేదా తీస్తున్నారా అని నిలదీశారు. కోపాన్ని దాచుకోవాలని ఇతరులకు చెప్పే నీవు ఎప్పుడైనా పాటించావా అని చివాట్లు పెట్టారు. 2014 నుంచి 2019 వరకూ రోడ్ల పనులు చేపట్టని అప్పటి ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. వర్షాకాలం ముగియగానే రోడ్ల మరమ్మత్తు పనులకై 2 వేల 2 వందల కోట్లు కేటాయించిన విషయాన్ని మంత్రి కన్నబాబు(Kannababu)గుర్తు చేశారు. 

చంద్రబాబు(Chandrababu), పవన్ కళ్యాణ్ ఒకరికొకరు తోడు లేకుండా రాజకీయాలు చేయలేరనేది పవన్ కళ్యాణ్ మాటలతోనే తెలుస్తోందన్నారు. ఓసారి టీడీపీ, మరోసారి లెఫ్ట్, ఇంకోసారి బీజేపీతో(BJP)ప్రయాణం చేయడం ఎంతవరకూ సమంజసమో చెప్పాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకం లేక ఉగ్రవాదిలా మాట్లాడుతున్నావంటూ దుయ్యబట్టారు. ఓ కులం భుజాలపై తుపాకీ పెట్టి కాలుస్తాననడం ప్రజాస్వామ్యంలో సరైందా అని అడిగారు. ముద్రగడను అవమానించినప్పుడు, పరామర్శకై వస్తున్న చిరంజీవిని(Chiranjeevi) రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో అడ్డుకున్నప్పుడు ఏమయ్యావని మంత్రి కన్నబాబు నిలదీశారు. కొన్ని ప్రత్యేక కులాల ప్రస్తావన తీసుకొచ్చి చేసిన వ్యాఖ్యలు మంచిది కాదని హితవు పిలికారు. 

Also read: YS Jagan Target 2024: 2024 అసెంబ్లీ ఎన్నికలకు వైఎస్ జగన్ టార్గెట్ సిద్ధమైందా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News