INDIA WOMEN VS AUSTRALIA WOMEN: ఆస్ట్రేలియాతో ఉత్కంఠభరితంగా సాగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత్ మహిళల జట్టు ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీంతో ఆస్ట్రేలియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.
THE STREAK LIVES ON #AUSvIND pic.twitter.com/pj744Pc4Dz
— cricket.com.au (@cricketcomau) September 24, 2021
సెంచరీతో అదరగొట్టిన బ్రీత్ మూనీ
ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ఆనంతరం 275పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆదిలోనే ఫామ్‌లో ఉన్న అలీసా హీలీ, కెప్టెన్ మెగ్ లానింగ్ వికెట్లను కోల్పోయింది. ఈ క్రమంలో మరో ఓపెనర్ బ్రీత్ మూనీ సెంచరీ తో చెలరేగింది. ఆస్ట్రేలియా విజయంలో మూనీ కీలక పాత్ర పోషించింది. ఒక దశలో 50 పరుగులకే 4కీలకమైన వికెట్లును ఆస్ట్రేలియా(Australia) కోల్పోయింది. దీంతో టీమిండియా(Team india) విజయం లాంఛనమే అనుకున్నారు అందరు. కానీ ఆస్టేలియా బ్యాట్స్ ఉమెన్ బ్రీత్ మూనీ, తహీలా మెగ్రాత్ భారత పతనాన్ని శాసించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన మూనీ 133 బంతుల్లో 12 ఫోర్లుతో 125 పరగులు చేసి ఆజేయంగా నిలిచింది. మెగ్రాత్ 77 బంతుల్లో 9 ఫోర్లుతో 74 పరుగులు చేసింది.
Also read: T20 World Cup in 2007: భళా భారత్... చారిత్రాత్మక విజయానికి 14 ఏళ్లు.. అలనాటి జ్ఞాపకాలు మీకోసం!
రాణించిన మంధాన
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత ఓపెనర్లు సృతి మందాన(Smriti Mandhana) , షెఫాలీ వర్మ శుభారంభం ఇచ్చారు. సృతి మందాన 94 బంతుల్లో 11 ఫోర్లుతో 86 పరుగులు చేసింది. రిచా ఘోష్ (50 బంతుల్లో 44 , 3 ఫోర్లు, 1 సిక్స్), పూజా వాస్త్రకర్ (29) ఫర్వాలేదనిపించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో తహీలా మెగ్రాత్ నాలుగు వికెట్లు పడగొట్టగా, మెలానిక్స్ రెండు వికెట్లు సాధించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Womens Cricket: సెంచరీతో చెలరేగిన ఆసీస్ ఓపెనర్...భారత్‌కు ఓటమి
రెండో వన్డేలో భారత్‌పై ఆసీస్ విజయం
సూపర్ సెంచరీ చేసిన ఆసీస్ ఓపెనర్
2-0తో సిరీస్ ను కైవసం చేసుకున్న ఆసీస్ మహిళల జట్టు