Aligarh man seeks divorce as wife doesn't bathe daily: భార్య నుంచి విడాకులు కోరుతూ ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. అయితే భర్త విడాకులు కావాలని అడగడం పక్కన పెడితే ఇందుకు అతను చెప్పిన కారణం మాత్రం వింతంగా ఉంది. భార్య రోజూ స్నానం(Bath) చేయడం లేదని చెబుతూ తనకు విడాకులు ఇప్పించాలని కోర్టులో పిటిషన్ వేశాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్(Uttarpradesh) రాష్ట్రంలోని అలీఘర్(Aligarh)లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే...
క్వార్సీ గ్రామానికి మహిళకు చందౌస్ గ్రామానికి చెందిన వ్యక్తికి రెండేళ్ల క్రితం వివాహం అవ్వగా.. ఏడాది వయసున్న పాప ఉంది. ఈ క్రమంలో రోజూ భార్య(Wife) స్నానం చేయడం లేదని, స్నానం చేయాలని అడిగిన ప్రతిసారి ఆమె తనతో గొడవ పడుతుందని అందుకే విడాకులు కావాలని కోరాడు. అయితే భర్తపై వ్యతిరేకంగా భార్య వుమెన్ ప్రొటెక్షన్ సెల్(Women Protection cell)లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తనకు విడాకులు తీసుకోవడం ఇష్టం లేదని, వివాహ బంధాన్ని కొనసాగించాలనుకుంటున్నట్లు వివాహిత వెల్లడించింది. ప్రస్తుతం ఈ జంటకు అలీగఢ్ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ కౌన్సిలింగ్ అందిస్తోంది.
ప్రతిరోజూ స్నానం చేయడం లేదనే సాకుతో భర్త తనకు ట్రిపుల్ తలాక్(Triple talaq) ఇచ్చాడని ఒక మహిళ తమకు వ్రాతపూర్వక ఫిర్యాదు ఇచ్చిందని వుమెన్ ప్రొటెక్షన్ సెల్ కౌన్సిలర్ తెలిపారు. వారి వివాహ బంధాన్ని కాపాడటానికి భర్తభర్తలిద్దరితో పాటు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ అందిస్తున్నామన్నారు. వారు తమ వైవాహిక జీవితాన్ని కొనసాగించాలని, భర్తతో ఆమె సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నట్లు కౌన్సిలర్ తెలిపారు.
పట్టుబడుతున్న భర్త
అయితే భర్త మాత్రం తనకు విడాకులు కావాలనే పదేపదే చెబుతున్నాడని, భార్య నుంచి విడాకులు తీసుకోవడంలో సాయం చేయాలని తమకు ఓ అప్లికేషన్ కూడా ఇవ్వాలని కోరినట్లు వెల్లడించారు. కానీ చిన్న చిన్న సమస్యలకే వివాహ బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోవద్దని తాము సూచించినట్లు తెలిపారు. విడాకులతో పిల్లల భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని చెప్పి అతన్ని నచ్చజేప్పుతున్నట్లు పేర్కొన్నారు. వారికి ఆలోచించడానికి మహిళా రక్షణ సెల్ కొంత సమయం ఇచ్చింది. అంతేగాక విడాకుల దరఖాస్తుకు భర్త(Husband) చెప్పిన కారణం ఏ హింసాత్మక చట్టం, మహిళలపై నేరం కిందకు రాదు కాబట్టి, పిటిషన్ ముందుకు సాగదన్నారు. కౌన్సిలింగ్ సహాయంతో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
UP: భార్య రోజూ స్నానం చేయడం లేదని.. విడాకులు కోరిన భర్త!
నా భార్య రోజూ స్నానం చేయడం లేదు
విడాకులు కోరిన భర్త
యూపీలోని అలీఘర్ లో ఘటన