Maestro Movie Review in Telugu: టాలీవుడ్ హీరో నితిన్(Nithiin) వరుస చిత్రాలతో అలరిస్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలను విడుదల చేసిన నితిన్ తాజాగా మరో సినిమా 'మాస్ట్రో'’(Maestro)తో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. బాలీవుడ్(Bollywood)లో ఘన విజయం సాధించిన ‘అంధాదున్’ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీకి మేర్లపాక గాంధీ(Merlapaka Gandhi) దర్శకత్వం వహించారు.
కథలోకి వెళ్దాం..
అరుణ్(నితిన్)కు 14ఏళ్ల వయసులో క్రికెట్ బాల్ తగలడం వల్ల కంటి చూపుపోతుంది. అయితే, అతనిలో ఉన్న టాలెంట్ ఏంటంటే పియానో(Piano) చక్కగా వాయించడం. తన పియానో పాడైపోవడంతో కొత్తది కొనుక్కోవాలని చూస్తాడు. ఈ క్రమంలోనే ఓ రెస్టారెంట్‌లో అమ్మకానికి ఉన్న పియానో కొందామని వెళ్తాడు. అక్కడే ఆ రెస్టారెంట్ ఓనర్ కుమార్తె సోఫి(నభా నటేశ్)తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారుతుంది. అదే రెస్టారెంట్‌కు తరచూ వస్తుంటాడు ఒకప్పటి హీరో అయిన మోహన్(నరేశ్). అరుణ్‌లోని టాలెంట్ చూసి తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఇంటికి వచ్చి పియానో వాయించమని చెబుతాడు. అరుణ్.. మోహన్ ఇంటికి వెళ్లే సరికి అతడు హత్యకు గురవుతాడు. ఇంతకీ ఈ హత్య చేసిందెవరు? దీనికీ మోహన్ భార్య సిమ్రన్(తమన్నా), బాబీ(జిషు సేన్ గుప్త)లకు సంబంధం ఏంటి? అంధుడైన అరుణ్ ఆ హత్య విషయాన్ని పోలీసులకు చెప్పాడా? మోహన్ హత్య అనంతరం అరుణ్ ఎదుర్కొన్న విపత్కర పరిస్థితులు ఏంటి? అసలు అరుణ్‌కు కళ్లు ఎలా పోయాయి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
Also Read: Nusrat Jahan: తన బిడ్డకు తండ్రి ఎవరో రివీల్ చేసిన ఎంపీ, నటి నుస్రత్ జహాన్
నటీ నటుల పనితీరు:
బాలీవుడ్ ‘అంధాదున్’లో ఆయుష్మాన్ ఖురానా(Ayushman Quran) అంధుడి పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు, నటుడిగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. అదే పాత్రను నితిన్(Nithiin) తెలుగులో చక్కగా చేశారు. ఆయుష్మాన్‌కు సమానంగా అంధుడి పాత్రలో నటించి మెప్పించే ప్రయత్నం చేశారు. ప్రథమార్ధమంతా సరదా సన్నివేశాలతో అంధుడిగా అలరించిన నితిన్, ద్వితీయార్ధానికి వచ్చే సరికి భావోద్వేగాలపరంగా చక్కటి హావభావాలు పలికించాడు. అరుణ్ పాత్రకు 100శాతం న్యాయం చేశాడు. నితిన్‌కు ‘మాస్ట్రో’ ఓ విభిన్న చిత్రంగా నిలిచిపోతుంది. ఇక ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది సిమ్రన్ పాత్ర పోషించిన తమన్నా(Tamannaah) గురించి. హిందీలో టబు(Tabu) ఈ రోల్ చేశారు. తెలుగులో తమన్నా కూడా చక్కగా నటించింది. రెండు భిన్న పార్శ్వాలను చూపించే ఆ పాత్రలో ఆమె ఒదిగిపోయింది. ఎమోషనల్ సన్నివేశాల్లో తనదైన నటన కనబరిచింది. ఇక జిషు సేన్ గుప్త, నభా నటేశ్(Nabha Natesh), శ్రీముఖి, రచ్చ రవి, మంగ్లీ, అనన్య నాగళ్ల, హర్ష వర్దన్ తమ పాత్రలకు న్యాయం చేశారు.
ప్లస్ పాయింట్
నటీనటుల నటన
ప్రథమార్ధం, ట్విస్ట్‌లు
ప్రొడక్షన్ వాల్యూస్
మైనెస్ పాయింట్
తెలుగు నేటివిటీ లేకపోవడం
ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాలు
చివరిగా: ‘అంధాదున్’ పర్‌ఫెక్ట్ రీమేక్.. ‘మాస్ట్రో!
గమనిక: ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Maestro Review: 'మాస్ట్రో' మూవీ రివ్యూ