EPFO: ఈపీఎఫ్ కస్టమర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త విన్పించింది. ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఎక్కౌంట్‌తో ఆధార్ నెంబర్ అనుసంధాన ప్రక్రియకు గడువు పొడిగించింది. ఎవరెవరికి పొడిగించిందనేది పరిశీలిద్దాం.
ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కొత్త నిబంధనల(EPF New Rules) ప్రకారం ఈపీఎఫ్ ఎక్కౌంట్‌ను ఆధార్ నెంబర్‌తో(Aadhaar Card) అనుసంధానం చేయాల్సి ఉంది. దీనికి సంబంధించిన గడువు సెప్టెంబర్ 1తో పూర్తయింది. అయితే కేంద్ర ప్రభుత్వం(Central government)ఇప్పుడు కొన్ని ప్రత్యేక కేటగరీలకు చెందినవారికి అనుసంధానం చేసే గడువు తేదీని పొడిగించింది. ఈశాన్య రాష్ట్రాల సంస్థలు, కొన్ని ప్రత్యేక కేటగరీ సంస్థలకు ఆధార్ నెంబర్‌తో యూఏఎన్ లింకు గడువును డిసెంబర్ 31,2021 వరకూ పొడిగించింది. ఈపీఎఫ్ కార్యాలయం అధికారి ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ఈశాన్య ప్రాంతంలో చాలామంది ఇంకా ఆధార్ నెంబర్‌ను అనుసంధానం చేయకపోవడంతో గడువు పొడిగించినట్టు తెలుస్తోంది. 220 మిలియన్లకు పైగా ఖాతాలు, 12 లక్షల కోట్ల కార్పస్ ఫండ్ కలిగిన ఈపీఎఫ్ఓ ప్రపంచంలోని అతి పెద్ద సామాజిక భద్రతా సంస్థల్లో ఒకటిగా ఉంది.
ఈపీఎఫ్(EPF) కొత్త నిబంధనల ప్రకారం యూఏఎన్ నెంబర్‌తో ఆధార్ లింక్(Aadhaar and UAN link) చేయం తప్పనిసరి. ఈపీఎఫ్ సామాజిక భద్రత కోడ్ 2020 సెక్షన్ 142లో కొన్ని కీలక మార్పులు కూడా చేసింది. ఇక నుంచి పీఎఫ్ సభ్యులు..సోషల్ సెక్యూరిటీ కోడ్ కింద ఏదైనా ప్రయోజనం పొందాలంటే ఆధార్ నెంబర్-యూఏఎన్ లింక్ తప్పనిసరి అని పేర్కొంది. రెండింటినీ లింక్ చేయనివారికి పీఎఫ్ కంట్రిబ్యూషన్ అందకపోవడమే కాకుండా..ఇతర పీఎఫ్ సేవలు అగిపోతాయి. పెన్షన్ ఫండ్ నుంచి డబ్బు తీసుకోవడం కూడా కష్టమవుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook