Two Boats Collide In Assam : అసోంలో ఘోర సంఘటన జరిగింది. బ్రహ్మాపుత్ర నది(brahmaputra river ) లో ప్రయాణికులతో వెళ్తున్న రెండు పడవలు ఒకదానికొకటి ఢీకొని బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో దాదాపు వంద మంది నీటిలో గల్లంతైనట్లు సమాచారం. జోర్హాత్ జిల్లా(Jorhat District)లో ఈ ఘటన చోటుచేసుకుంది. మజులి నుంచి నీమాటిఘాట్‌కు వెళ్తున్న ఓ పడవ.. తిరుగు ప్రయాణం చేస్తున్న ఓ పడవ రెండూ ఢీకొన్నాయి. ఈ రెండు పడవల్లో కలిపి వంద మందికిపైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
బోల్తా పడడంతో పడవల్లోని కొందరు ప్రయాణికులు ఈదుతూ ఒడ్డుకు చేరారు. ఈత రాని వారు మునిగిపోయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే జాతీయ, రాష్ట్ర విపత్తు స్పందన దళాలు (ఎన్డీఆర్ఎఫ్- ఎస్డీఆర్ఎఫ్) రంగంలోకి దిగారు. నీటిలో గల్లంతయిన వారి ఆచూకీ కోసం గాలిస్తున్నాయి. ఈ ఘటనపై కేంద్ర షిప్పింగ్, ఓడరేవుల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్(Sarbananda Sonowal) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Also Read: Horrible video: ఒళ్లు గగ్గురు పొడిచే వీడియో... చూస్తే కాసేపు గుండె ఆగటం ఖాయం!
ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ(CM Himanta Biswasharma)తో వెంటనే ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఘటనకు గల కారణాలు కూడా తెలుసుకుంటున్నారు. నదిలో ఈ రెండు పడవలు ఢీకొన్నాయని సమాచారం. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తుండడంతో నది ప్రవాహం అధికంగా ఉండడం వలన ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook