SBI special fixed deposit: ఎస్‌బీఐ ప్లాటిన‌మ్ డిపాజిట్ స్కీమ్‌కు మ‌రో వారం మాత్ర‌మే గడువు

SBI special fixed deposit scheme : హైదరాబాద్‌:  75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను (75 years of Independence) పురస్కరించుకుని రిటైల్ డిపాజిటర్ల‌ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) ఈ స్పెషల్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. దీని పేరు ఎస్‌బీఐ ప్లాటిన‌మ్ డిపాజిట్స్‌.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 6, 2021, 08:46 PM IST
    • 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని స్పెషల్ స్కీమ్‌

    • 75 రోజులు, 75 వారాలు, 75 నెల‌ల కాల‌ప‌రిమితితో ట‌ర్మ్ డిపాజిట్లు

    • నెల‌వారీ లేదా త్రైమాసికోసారి వడ్డీ

SBI special fixed deposit: ఎస్‌బీఐ ప్లాటిన‌మ్ డిపాజిట్ స్కీమ్‌కు మ‌రో వారం మాత్ర‌మే గడువు

SBI special fixed deposit scheme : హైదరాబాద్‌: బ్యాంకులు అప్పుడప్పుడు కొన్ని మంచి స్కీంలు అందిస్తుంటాయి. ప్రస్తుతం  ఎస్‌బీఐ (SBI) ఒక మంచి స్కీమ్‌ రిలీజ్ చేసింది.  75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను (75 years of Independence) పురస్కరించుకుని రిటైల్ డిపాజిటర్ల‌ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) ఈ స్పెషల్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. దీని పేరు ఎస్‌బీఐ ప్లాటిన‌మ్ డిపాజిట్స్‌. 

 

 

 

సెప్టెంబ‌రు 14 వ‌ర‌కు ఈ పథకం అమ‌ల్లో ఉంటుంది. దీనిలో 75 రోజులు, (75 days) 75 వారాలు, 75 నెల‌ల కాల‌ప‌రిమితితో ట‌ర్మ్ డిపాజిట్లు చేసుకోవచ్చు. డిపాజిట‌ర్లు ఈ ప‌థ‌కం ద్వారా 15 బేసిస్ పాయింట్ల వరకు అద‌న‌పు వ‌డ్డీ ప్ర‌యోజ‌నాన్ని పొందొచ్చు. 

వ‌డ్డీ రేట్లు ఇలా ఉన్నాయి ..

ప్లాటినమ్‌: 75 రోజులు - 3.95 శాతం

ప్లాటినమ్‌: 525 రోజులు - 5.10 శాతం

ప్లాటినమ్‌: 2250 రోజులు - 5.55 శాతం

Also Read : భారీగా పెరిగిన బంగారం ధరలు, ఒక్కరోజులోనే 3 వందలకు పైగా

సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు ఇచ్చే వ‌డ్డీ రేట్లు..

ప్లాటినమ్‌: 75 రోజులు - 4.45 శాతం

ప్లాటినమ్‌: 525 రోజులు - 5.60 శాతం

ప్లాటినమ్‌: 2250 రోజులు - 6.20 శాతం (ఎస్‌బీఐ వియ్‌కేర్ స్కీమ్ కింద వ‌డ్డీ రేటు వ‌ర్తిస్తుంది)

ఎన్ఆర్ఈ, ఎన్నార్వో ట‌ర్మ్ డిపాజిట్లు స‌హా రూ.2 కోట్ల లోపు దేశీయ రిటైల్ టర్మ్ డిపాజిట్లను ఎస్‌బీఐ ప్లాటిన‌మ్ డిపాజిట్ స్కీమ్ (SBI Platinum Deposit Scheme) కింద అనుమ‌తిస్తారు. ఎన్ఆర్ఈ డిపాజిట్స్ కేవలం 525 రోజులు, 2250 రోజులకు మాత్రమే వర్తిస్తాయి. టర్మ్ లేదా స్పెషల్ టర్మ్ డిపాజిట్స్‌ (Term or Special Term Deposits‌) మాత్రమే ఈ పథకానికి వర్తిస్తాయి. ఇక ట‌ర్మ్ డిపాజిట్లకు నెల‌వారీ లేదా త్రైమాసికోసారి వడ్డీ చెల్లిస్తారు. స్పెష‌ల్ ట‌ర్మ్ డిపాజిట్ల‌కు మెచ్యూరిటీ తేదీకి వడ్డీ చెల్లిస్తారు.

Also Read : IT Returns Exemption: ఐటీ రిటర్న్స్ దాఖలు నుంచి ఇకపై మినహాయింపు, కేంద్ర ఆర్ధికశాఖ ఆద

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News