AP Corona Update: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి సంక్రమణ నెమ్మదిగా విస్తరిస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మొన్నటి వరకూ తగ్గుముఖం పట్టిన కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది.
కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave)నుంచి కోలుకున్న ఏపీలో గత కొద్దికాలంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య దాదాపుగా తగ్గిపోయింది. అయితే 3-4 రోజుల్నించి మళ్లీ స్వల్పంగా పెరుగుతున్నట్టు కన్పిస్తోంది. రోజురోజుకూ కొత్త కేసుల సంఖ్యలో పెరుగుదల కన్పించడమే దీనికి కారణం. మొన్నటి వరకూ అంటే ఓ దశలో రోజుకు వేయికి దిగువకు చేరుకున్న కేసులు..ఇప్పుడు మళ్లీ 15 వందలు దాటుతున్నాయి. ఈ నేపధ్యంలో కరోనా సంక్రమణకు బ్రేక్ వేసేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
ఏపీలో గత 24 గంటల్లో 65 వేల 596 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు (Covid19 Tests)నిర్వహించగా కొత్తగా 1623 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అటు 8 మంది కోవిడ్ కారణంగా మరణించారు. అదే సమయంలో గత 24 గంటల్లో ఏపీలో కోవిడ్ నుంచి 1340 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 19 లక్షల 92 వేల 256 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 13 వేల 911 మంది కోవిడ్ కారణంగా మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 15 వేల 158 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 2 కోట్ల 69 లక్షల 39 వేలమందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశారు. రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 342 మందికి, చిత్తూరులో 276 మందికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణైంది.
Also read: IT Refund Status: ఇన్‌కంటాక్స్ రిఫండ్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook