AP Corona Update: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ సంక్రమణ తగ్గినట్టే తగ్గి మళ్లీ స్వల్పంగా పెరుగుతోంది. ఫలితంగా గత 24 గంటల్లో మరో 1248 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం నైట్‌కర్ప్యూ మాత్రమే అమలవుతోంది.
ఏపీలో కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) విపత్కర పరిస్థితులు ఇప్పుడిప్పుడే సాధారణమౌతున్నాయి. ఈ దశలో కరోనా వైరస్ సంక్రమణ కూడా దాదాపుగా తగ్గింది. గత కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తున్న కరోనా పాజిటివ్ కేసులు మరోసారి స్వల్పంగా పెరిగాయి. ఈ క్రమంలో అధికారుల్లో ఆందోళన పెరుగుతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 58 వేల 890 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..1248 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణైంది. గత రెండ్రోజుల్నించి ఈ సంఖ్య వేయికి దిగువలో ఉంది. మరోవైపు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20 లక్షల 4 వేల 590కు చేరుకుంది. గత 24 గంటల్లో 1715 మంది కోవిడ్ నుంచి కోలుకోగా..ఇప్పటి వరకూ ఆ సంఖ్య. 19 లక్షల 77 వేల 163గా ఉంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 15 మంది కోవిడ్ కారణంగా మృతి చెందారు. ఏపీలో ఓవైపు స్కూల్స్ ప్రారంభం కాగా..మరోవైపు నైట్‌కర్ఫ్యూ(Night Curfew) మాత్రం కొనసాగుతోంది.
Also read: Richter Scale: బంగాళాఖాతంలో భూకంపం, చెన్నైలో కంపించిన భూమి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook