Joe Biden on Afghan: ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించడంతో రేగుతున్న ప్రశ్నలకు అగ్రరాజ్యం బాధ్యత వహించాలనే చర్చ ప్రారంభమైంది. యుద్ధక్షేత్రంగా మారిన ఆఫ్ఘన్ నుంచి అమెరికా సైన్యాన్ని ఉపసంహరించడంపై జో బిడెన్ ఏమంటున్నారు..
20 ఏళ్ల పాటు ఆ దేశంలో ఉన్న అమెరికా సైన్యం..ఆఫ్ఘన్(Afghanistan)నుంచి నిష్క్రమించడంతో పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. తాలిబన్లు దేశాన్ని ఆక్రమించేశారు. ఆఫ్ఘన్లో పరిస్థితులు ఘోరంగా మారిపోయాయి. తాలిబన్లపై భయంతో జనం దేశం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు.ఈ క్రమంలో అమెరికా సైన్యాన్ని ఉపసంహరించడంపై ప్రశ్నలు తలెత్తాయి. అయితే ఆఫ్ఘన్ నేల నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకోవడాన్ని ఆ దేశాధ్యక్షుడు జో బిడెన్(Joe Biden)పూర్తిగా సమర్ధించుకుంటున్నారు.యుద్ధక్షేత్రంగా మారిన ఆఫ్ఘన్ నుంచి అమెరికా సైన్య నిష్క్రమణ..చరిత్రలో సహేతుక రీతిలో నిలుస్తుందని తెలిపారు. ఆగస్టు 31 లోగా అమెరికా సైన్యం పూర్తిగా స్వదేశానికి రావల్సి ఉండగా..అంతకు ముందే తాలిబన్లు దేశాన్ని ఆక్రమించారు.
జో బిడెన్ తీసుకున్న నిర్ణయంతో విపక్ష రిపబ్లికన్ పార్టీ సహా పలువురు జో బిడెన్‌పై విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలకు వైట్‌హౌస్‌లో(White house)మీడియా ముందు సమాధానం చెప్పారు. తమ నిర్ణయం న్యాయబద్ధమైన, సహేతుకమైన నిర్ణయంగా నిలిచిపోతుందని భావిస్తున్నానన్నారు. ఇప్పటికైనా తాలిబన్లు ప్రజామోద నిర్ణయాలు తీసుకోవాలని, దేశాన్ని ఆర్ధికంగా, వాణిజ్యపరంగా నిలబెట్టాలని సూచించారు. తమ ధర్మమే ఆఫ్ఘన్లో కొనసాగాలని తాలిబన్లు కోరుకుంటున్నట్టు జో బిడెన్ తెలిపారు. తాలిబన్లు(Talibans)సరైన ప్రణాళిక లేని సాయుధమూకల గుంపు అని జో బిడెన్ వ్యాఖ్యానించారు.
Also read: Coronavirus: ఆఫ్ఘన్ నుంచి ఇండియా వచ్చినవారికి కరోనా వైరస్, ఆందోళన కల్గిస్తున్న పరిణామాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook