శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్షరుతువు, శ్రావణమాసం, శుక్లపక్షం; తిథి: చతుర్దశి రా. 6.45 తదుపరి పూర్ణిమ; నక్షత్రం: శ్రవణం రా. 8.34 తదుపరి ధనిష్ఠ; వర్జ్యం: రా. 12.35-2.48;
దుర్ముహూర్తం: ఉ. 55.0.-7.26;
అమృతఘడియలు: ఉ. 10.25-11.57;
రాహుకాలం: ఉ. 9.00-10.30;
సూర్యోదయం: 6.05;
సూర్యాస్తమయం: 6.35
మేషం...
ఆలయాలు సందర్శిస్తారు, ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి, ఉద్యోగ పరిస్థితులు అనుకూలిస్తాయి, కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు పొందుతారు.
వృషభం...
సంతానానికి నూతన ప్రయత్నాలు, సంఘంలో నూతన గౌరవం పొందుతారు, వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చిక్కులు, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు.
మిథునం...
కుటుంబ శుభకార్యాలలో ప్రస్తావన ఉంటుంది. వృథా ఖర్చులు, బాధ్యతలు పెరుగుతాయి, ఆభరణాలు కొనుగోలు చేస్తారు, వాహనసౌఖ్యం, దైవదర్శనాలు.
కర్కాటకం...
బంధువులతో ఏర్పడిన మాటపట్టింపులు తొలగిపోతాయి, ముఖ్య నిర్ణయాలు,వ్యవహారాలలో విజయం, ప్రయాణాల్లో తొందరపాటు వద్దు, వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు.
సింహం...
ఇతరుల విషయంలో జోక్యం వద్దు, మిత్రులతో వివాదాలు తీరతాయి., ఉద్యోగంలో స్థాన మార్పులు ఉండును, చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు, కాంట్రాక్టులు దక్కుతాయి.
కన్య...
రుణదాతల ఒత్తిడులు, బంధువుల నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు, ఆలయాలు సందర్శిస్తారు, వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి మరియు శుభవార్తలు వింటారు.
Also Read: Varalakshmi Vratham 2021: వరలక్ష్మి వ్రతం...ఇంటిల్లిపాదికి శుభకరం!
తుల...
వస్తు సేకరణ, మిత్రులతో అకారణంగా విభేదాలు, ఆకస్మిక ప్రయాణాలు, ఆర్థిక ఇబ్బందులు. పెట్టుబదిలలో తగిన లాభాలు పొందుతారు, మానసిక ఆందోళన, వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
వృశ్చికం...
కొత్త మిత్రుల పరిచయం, బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు, సోదరులతో సఖ్యత. దైవదర్శనాలు, వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
ధనుస్సు...
ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు. ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రమే , అనారోగ్యం, శ్రమాధిక్యం, భాగస్వామి నుండి వస్తు, ధన లాభాలు పొందుతారు.
మకరం...
నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు, శుభవార్తలు అందుతాయి, అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి, భూయోగాలు పొందుతారు.
కుంభం...
ఆర్థిక పరిస్థితిలో కొంచెం అనుకూలం, ఆరోగ్యసమస్యలు, ప్రయాణాలు రద్దు, భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి, బంధువులతో తగాదాలు.
మీనం...
మిత్రుల నుంచి కీలక సమాచారం, నూతన ఉద్యోగయత్నాలు సఫలం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది, విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook