Haiti Earthquake: హైతీలో భారీ భూకంపం, 3 వందలకు పైగా మరణాలు

Haiti Earthquake: భారీ భూకంపంతో ఆ దేశం వణికిపోయింది. పదకొండేళ్ల నాటి మారణహోమం కళ్లముందు కన్పించింది. భారీ భూకంపంతో ఇళ్లన్నీ నేలమట్టమై..వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 15, 2021, 09:30 AM IST
Haiti Earthquake: హైతీలో భారీ భూకంపం, 3 వందలకు పైగా మరణాలు

Haiti Earthquake: భారీ భూకంపంతో ఆ దేశం వణికిపోయింది. పదకొండేళ్ల నాటి మారణహోమం కళ్లముందు కన్పించింది. భారీ భూకంపంతో ఇళ్లన్నీ నేలమట్టమై..వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారు.

కరేబియన్ దేశంలో భారీ భూకంపం సంభవించింది.రెక్టర్ స్కేల్‌పై(Richter Scale)7.2కు పైగా నమోదై దేశాన్ని ఒక్కసారిగా వణికించేసింది. ఇళ్లు, భారీ భవనాలు, రోడ్లు, విద్యుత్ స్థంభాలు అన్నీ నేలమట్టమయ్యాయి. కరేబియన్ దేశమైన హైతీలో జరిగిన ఘోర దృశ్యమిది. భూకంపం ధాటికి ఏకంగా 3 వందలకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఎటు చూసినా కూలిన భవనాలే కన్పిస్తున్నాయి. క్షతగాత్రుల సంఖ్య ఊహించని రీతిలో ఉండవచ్చని తెలుస్తోంది. 

హైతీ(Haiti Earthquake) రాజధాని పోర్టౌ ప్రిన్స్‌కు పశ్చిమంగా 125 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైనట్టు సమాచారం. భూకంపం గురించి తెలిసిన వెంటనే హైతీ సివిల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ సహాయకచర్యల్లో దిగింది. భూకంపంపై ప్రధాని ఏరియల్ హెన్రీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నెలరోజుల వరకూ దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. పరిస్థితిని పూర్తిగా సమీక్షించాక..అవసరమైతే అంతర్జాతీయ సమాజం సహాయాన్ని కోరతామని చెప్పారు. పదకొండేళ్ల క్రితం అంటే 2010లో జరిగిన పెను భూకంపం(Massive Earthquake) కళ్లముందు కదలాడుతోంది. నాటి భూకంపంలో ఏకంగా 3 లక్షలమంది మరణించారు. హైతీలో ఇప్పుడు ఎటు చూసినా శవాలు గుట్టలుగా కన్పిస్తున్నాయి. భవనాలన్నీ నేలమట్టమై శిధిలాలు దర్శనమిస్తున్నాయి. హైతీలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అమెరికా సహాయక విభాగం కూడా రంగంలో దిగినట్టు తెలుస్తోంది. 

Also read: Delta Virus: కబళిస్తున్న కరోనా.. ఒకేరోజు 10 వేలమందిని బలిగొన్న మహమ్మారి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News