Pegasus Spyware: పెగసస్ స్పైవేర్ దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. పెగసస్ వ్యవహారంపై చర్చకు విపక్షాలు పట్టబడుతూనే ఉన్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్బంగా ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కీలక ప్రకటన చేసింది.
ఇజ్రాయిల్ కంపెనీ అభివృద్ధి చేసిన పెగసస్ స్పైవేర్(Pegasus spyware)సృష్టిస్తున్న ప్రకంపనలతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు అంతరాయం కలుగుతోంది. ప్రతిరోజూ విపక్షాలు ఈ అంశంపై చర్చకు పట్టుబడుతున్నాయి. సభా వ్యవహారాలకు అంతరాయం కల్గిస్తున్నాయి. ఈ క్రమంలో విపక్షాల డిమాండ్‌కు కేంద్రం స్పందించింది. పెగసస్ వ్యవహారంపై కీలక ప్రకటన విడుదల చేసింది.
పెగసస్ స్పైవేర్ అభివృద్ధి చేసిన ఇజ్రాయిల్ కంపెనీ ఎన్ఎస్ఓతో ఎటువంటి లావాదేవీలు జరపలేదని కేంద్ర రక్షణశాఖ (Union Defence Ministry)స్పష్టం చేసింది. ఎన్ఎస్ఓ టెక్నాలజీస్‌తో ఏమైనా లావాదేవీలు జరిపిందా లేదా అనే ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చింది.ఎన్ఎస్ఓ గ్రూప్ టెక్నాలజీస్‌తో ఎలాంటి లావాదేవీలు జరపలేదని తెలిపింది.పెగసస్ స్పైవేర్‌తో ఎవరిపైనా అక్రమంగా నిఘా పెట్టలేదని ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం(Central government) చెబుతూనే ఉంది. అయితే విపక్షాలు మాత్రం అంగీకరించకుండా గందరగోళం సృష్టిస్తూ వచ్చాయి.కేంద్రానికి ఎన్ఎస్ఓతో ఏదైనా సంబంధముందా, దేశ పౌరులపై కేంద్రం నిఘా పెట్టిందా లేదా అనే ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పాలని విపక్షాలు కేంద్రాన్ని కోరాయి. పార్లమెంట్‌లో రక్షణశాఖ ఇచ్చిన సమాధానంతో విపక్షాలు శాంతించే పరిస్థితి కన్పించడం లేదు.
Also read: రెడ్ లిస్ట్ నుంచి అంబర్ లిస్ట్‌కు మారిన ఇండియా, యూకే వెళ్లాలంటే ఇక సులభమే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
పెగసస్ స్పైవేర్ వ్యవహారంపై కీలక ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వం