Revanth Reddy, Kokapeta lands: రేవంత్ రెడ్డి హౌజ్ అరెస్ట్

Kokapeta lands auction: హైదరాబాద్: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు హౌజ్ అరెస్ట్ (Revanth Reddy house arrest) చేశారు. కోకాపేటలో ప్రభుత్వం వేలం వేసిన భూముల పరిశీలన, ధర్నాకు కాంగ్రెస్  పిలుపునిచ్చిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి కోకాపేటకు వెళ్లకుండా అడ్డుకునేందుకు భారీ సంఖ్యలో పోలీసులు ఆయన నివాసం వద్ద మోహరించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 19, 2021, 01:41 PM IST
Revanth Reddy, Kokapeta lands: రేవంత్ రెడ్డి హౌజ్ అరెస్ట్

Kokapeta lands auction: హైదరాబాద్: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు హౌజ్ అరెస్ట్ (Revanth Reddy house arrest) చేశారు. కోకాపేటలో ప్రభుత్వం వేలం వేసిన భూముల పరిశీలన, ధర్నాకు కాంగ్రెస్  పిలుపునిచ్చిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి కోకాపేటకు వెళ్లకుండా అడ్డుకునేందుకు భారీ సంఖ్యలో పోలీసులు ఆయన నివాసం వద్ద మోహరించారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ నేతలు కోకాపేట భూముల సందర్శనకు వెళ్లడానికి వీలు లేకుండా కోకాపేటకు (Kokapeta) దారితీసే మార్గాలన్నింటిని పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీ నిర్వహిస్తున్నారు. 

పీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, జగ్గా రెడ్డి (Jagga Reddy), రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు నరసింహా రెడ్డి, పీసీసీ కార్యవర్గసభ్యులు తదితరులు కోకాపేట వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలను అడ్డుకునేందుకు పోలీసులు అన్ని మార్గాల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. 

Also read: AP CM YS Jaganపై అలిగి YSR Telangana Party పెట్టలేదన్న వైఎస్ షర్మిల

ఇప్పటికే హైదరాబాద్ నుంచి బయల్దేరిన పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను (Telangana congress) నగర శివార్లలోని నార్సింగిలో పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఇదిలావుంటే, కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఎలాగైనా సరే కోకాపేట ప్రభుత్వ భూములు (Kokapeta lands auction) ప్రైవేటుపరం కాకుండా అడ్డుకుంటామని చెబుతున్నారు.

Also read: OU VI semester exams schedule: ఓయూ సెమిస్టర్ పరీక్షలు షెడ్యూల్ ఖరారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News