Virbhadra Singh Death News: హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం వీరభద్ర సింగ్ కన్నుమూత

Virbhadra Singh Passes Away: దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ గురువారం వేకువజామున 3:40 గంటలకు షిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీలో తుదిశ్వాస విడిచారు

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 8, 2021, 09:50 AM IST
Virbhadra Singh Death News: హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం వీరభద్ర సింగ్ కన్నుమూత

Virbhadra Singh Dies: హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత వీరభద్ర సింగ్ కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వీరభద్ర సింగ్ గురువారం వేకువజామున 3:40 గంటలకు షిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సీనియర్ మెడికల్ సూపరింటెండ్ డాక్టర్ జనక్ రాజ్ వెల్లడించారు. 

87 ఏళ్ల వయసున్న హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం వీరభద్ర సింగ్‌కు సోమవారం నాడు గుండెపోటు వచ్చింది. ఆయన పరిస్థితి విషమంగా ఉందని, ఐజీఎంసీలో చికిత్స పొందుతున్నారని ఇటీవల ప్రకటన విడుదల చేశారు. వెంటిలేటర్ మీద ఉంచి కార్డియాలజీ నిపుణులు ఆయనకు చికిత్స అందించారు. అయితే డాక్టర్లు చేసిన ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో వీరభద్రసింగ్ కన్నుమూశారు. కాంగ్రెస్ (Congress Party) పార్టీకి హిమాచల్ ప్రదేశ్‌లో అధికారం అందించిన కన్నుమూయడం (Virbhadra Singh Passes Away) పార్టీకి తీరనిలోటు అని నేతలు అభిప్రాయపడుతున్నారు.

Also Read: PM Modi cabinet expansion: కేంద్ర కేబినెట్‌లో కొత్త మహిళా కేంద్ర మంత్రులు వీళ్లే

వీరభద్ర సింగ్ 9 పర్యాయాలు ఎమ్మెల్యేగా సేవలు అందించారు. 5 పర్యాయాలు ఎంపీగా ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్‌కు 6 పర్యాయాలు ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించారు. ఏప్రిల్ 12న తొలిసారి కరోనా బారిన పడిన వీరభద్రసింగ్ మోహాలిలోని మాక్స్ ఆసుపత్రిలో చికిత్స అనంతరం కోలుకున్నారు. అయితే రెండు నెలల వ్యవధిలో మరోసారి కరోనా బారినపడటంతో ఆరోగ్యం క్షీణించింది. జూన్ 11న రెండో పర్యాయం కోవిడ్19 (Covid-19) పాజిటివ్‌ అని వైద్యులు నిర్ధారించారు. ఐజీఎంసీలో వీరభద్రసింగ్‌కు వైద్యులు చికిత్స అందించారు. 

Also Read: Hari Babu Kambhampati: మిజోరం గవర్నర్‌గా విశాఖ మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు నియామకం

ఏప్రిల్ 8, 1993న తొలిసారి హిమాచల్ ప్రదేశ్ సీఎంగా ప్రమాణం చేసిన వీరభద్రసింగ్ తన రాజకీయ జీవితంలో మొత్తం 6 పర్యాయాలు ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. పర్యాటక మరియు పౌరయాన శాల సహాయ మంత్రిగా ఓ పర్యాయం చేశారు. పరిశ్రమలశాఖ, ఉక్కుశాఖ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖలలో కేంద్రమంత్రిగా పనిచేసిన విశేష అనుభవం వీరభద్రసింగ్ సొంతం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News