IPL Season 14: ఐపీఎల్ సీజన్ 14 లో విదేశీ ఆటగాళ్లకు గ్రీన్ సిగ్నల్, ఫ్రాంచైజీలకు గుడ్‌న్యూస్

IPL Season 14: ఐపీఎల్ సీజన్ 14 ఫ్రాంచైజీలకు ఇది కాస్త ఉపశమనం కల్గించే విషయం. బీసీసీఐ ప్రయత్నాలు కొద్దిమేర సఫలీకృతమయ్యాయి. ఐపీఎల్ సీజన్ 14 మళ్లీ ప్రారంభం కానున్న నేపధ్యంలో ఆ ఆటగాళ్లకు అనుమతి లభించనుంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 26, 2021, 03:40 PM IST
IPL Season 14: ఐపీఎల్ సీజన్ 14 లో విదేశీ ఆటగాళ్లకు గ్రీన్ సిగ్నల్, ఫ్రాంచైజీలకు గుడ్‌న్యూస్

IPL Season 14: ఐపీఎల్ సీజన్ 14 ఫ్రాంచైజీలకు ఇది కాస్త ఉపశమనం కల్గించే విషయం. బీసీసీఐ ప్రయత్నాలు కొద్దిమేర సఫలీకృతమయ్యాయి. ఐపీఎల్ సీజన్ 14 మళ్లీ ప్రారంభం కానున్న నేపధ్యంలో ఆ ఆటగాళ్లకు అనుమతి లభించనుంది.

ఐపీఎల్ సీజన్ 14 (IPL Season 14) టీ20 క్రికెట్ టోర్నీ కరోనా మహమ్మారి కారణంగా అర్ధంతరంగా నిలిచిపోయింది. ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా 29 మ్యాచ్‌లు మాత్రమే జరిగాయి. మిగిలిన మ్యాచ్‌లను సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 15 వరకూ యూఏఈలో(UAE)నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. అయితే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, వెస్ట్ ఇండీస్ దేశాలకు ద్వైపాక్షిక సిరీసులు ఉండటంతో ఈ దేశాలకు చెందిన ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడేందుకు అనుమతి లభించలేదు. ఫలితంగా ఈ దేశాల ఆటగాళ్లను కలిగిన ఐపీఎల్ ఫ్రాంచైజీలకు సమస్యగా మారింది. బీసీసీఐ రంగంలో దిగి ఆ దేశాల క్రికెట్ బోర్డులతో చర్చలు ప్రారంభించింది. 

ముందుగా వెస్ట్ ఇండీస్ క్రికెటర్ల విషయంలో బీసీసీఐ (BCCI) ప్రయత్నాలు ఫలించాయి. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌ను కొన్నిరోజుల ముందే నిర్వహించాలన్న బీసీసీఐ అభ్యర్ధనను వెస్ట్ ఇండీస్ (West Indies) అంగీకరించింది. ఫలితంగా వెస్ట్ ఇండీస్ ఆటగాళ్లు ఐపీఎల్ సీజన్ 14 రెండవ దశ ఆడేందుకు మార్గం సుగమమైంది. ఇక న్యూజిలాండ్ ఆటగాళ్ల విషయంలో కూడా బీసీసీఐ ప్రయత్నాలు ఫలించాయి. ఐపీఎల్ రెండవ దశ ఆడేందుకు ఆ దేశ ఆటగాళ్లకు లైన్ క్లియర్ అయ్యింది. ఐపీఎల్ ఆడాలా లేదా అంతర్జాతీయ మ్యాచ్‌లు అడాలా అనే నిర్ణయాన్ని ఆటగాళ్ల ఇష్టానికే వదిలేసింది కివీస్ క్రికెట్ బోర్డు. దాంతో న్యూజిలాండ్ (NewZealand) ఆటగాళ్లు ఐపీఎల్ సీజన్ 14 లో ఆడే పరిస్థితులు ఏర్పడ్డాయి.

Also read: Team India ఆటగాడు అజింక్య రహానే ఔట్‌తో కంగుతిన్న ఫ్యాన్, Viral Video

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News