Jyeshtha Purnima 2021 Puja vidhi, remedies: జ్యేష్ఠ పూర్ణిమకు హిందూ ధర్మంలో గొప్ప ప్రాముఖ్యత ఉంది. జ్యేష్ఠ మాసంలో వచ్చే శుక్ల పక్ష పౌర్ణమి తేదీనే జ్యేష్ఠ పూర్ణిమ అని కూడా అంటారు. జ్యేష్ఠ పూర్ణిమ నాడు విష్ణు మూర్తిని ప్రార్థించి, ఉపవాసం (Lord Vishnu Puja vidhi) ఉండే వారికి సకల శుభాలు కలుగుతాయని వేదాలు చెబుతున్నాయి. ఈ సంవత్సరం జ్యేష్ఠ మాసంలో వచ్చే శుక్ల పక్ష పౌర్ణమి ఇంకెప్పుడో కాదు.. ఇవాళే (Jyeshtha Purnima 2021). అవును, ఈ రోజు విష్ణువుకు ప్రత్యేక పూజలు చేసి వ్రతం ఆచరించిన వారికి డబ్బు (Money), ఆహారం కొరత ఉండదనేది విశ్వాసం. అంతేకాకుండా కోరిన కోరికలు నెరవేరుతాయనేది భక్తుల నమ్మకం.
పౌర్ణమి తేదీన, 11 గవ్వలను తీసుకొని వాటిని ఒక ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి ఆలయంలోని లక్ష్మీ దేవి పాదాల వద్ద ఉంచండి. ఆ తర్వాత, లక్ష్మీ దేవిని పూజించండి. పసుపు లేదా కుంకుమను గవ్వలపై చల్లండి. కొంత సమయం తరువాత ఆ గవ్వలు చుట్టిన బట్టను తీసుకెళ్లి మీరు ధనం దాచుకునే బీరువాలోనో లేక లాకర్లోనో దాచుకోవడం వల్ల లక్ష్మి దేవీ అనుగ్రహం (Goddess Laksmi Devi Puja vidhi) లభిస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి.
Also read : Shirdi Sai Baba madhyana aarati lyrics in Telugu: షిర్డీ సాయి బాబా మధ్యాహ్న హారతి తెలుగు లిరిక్స్
జ్యేష్ఠ పూర్ణిమ నాడు చంద్రుడిని (Praying moon on pournami) పూజించడంతో పాటు, తేనె, గంధపు చెక్కలను పాలలో కలిపి చంద్రునికి నమస్కరిస్తూ అర్పించాలి. అలా చేయడం వల్ల కోరికలన్నీ నెరవేరుతాయి అనేది భక్తుల బలమైన విశ్వాసం.
జ్యేష్ఠ పూర్ణిమ రోజు తెల్లవారుజామునే నిద్ర లేచి రావి చెట్టు (Peepal tree) మొదలు వద్ద తీర్థ, ప్రసాదాలు అర్పించి పూజిస్తే.. మీ జీవితంలోని సమస్యలు, కష్టనష్టాలు తొలగిపోతాయట.
Also read: Sai Baba puja vidhi: సాయి బాబాను ఎలా పూజిస్తే ఏమేం ఫలితాలు కలుగుతాయి ?
వ్యాపారంలో లాభం (How to earn profits in business) పొందడానికి, నష్టాల నుంచి బయటపడటానికి, లక్ష్మీదేని అనుగ్రహం పొందడానికి (Lakshmi devi puja vidhi) జ్యేష్ఠ పౌర్ణమి రోజున పచ్చి పాలు (Raw milk), నీళ్లు తీసుకుని, అందులో బతాషాలను (Batasha) కలిపి రావి చెట్టుకు ప్రసాదంగా అందిస్తే పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయని నమ్మకం. బతాషాలు పూజా సామాగ్రి (Puja Samagri for Vishnu Puja vidhi) లభించే దుకాణాలు, జాతరలు జరిగే చోట లభిస్తాయి. వీటినే కొంతమంది బత్తీసలు అని కూడా అంటారు.
Also read: Hanuman Puja Vidhanam in Telugu: హనుమాన్ పూజ ఇలా చేస్తే కష్టాలన్ని తొలగి, కోరికలన్నీ నెరవేరుతాయట
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook