BSNL Recharge Plan: దేశంలోని అతిపెద్ద టెలికాం సంస్థలలో ఒకటైన రిలయన్స్ జియో (Reliance Jio) తన వినియోగదారులకు ఇంటర్నెట్ వినియోగంలో మార్పులు చేపట్టింది. రోజువారీ డేటా వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని డేటా పరిమితిని తొలగించాలని ఇటీవల నిర్ణయం తీసుకుంది. తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడూ కొత్త ప్లాన్స్ ప్రవేశపెట్టే జియో రూ.597తో ప్రత్యేక ప్లాన్ తీసుకొచ్చింది. దీని వ్యాలిడిటీ 90 రోజులు.
రిలయన్స్ జియో స్పెషల్ ప్లాన్‌కు ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (BSNL) గట్టి పోటీ ఇచ్చింది. తాజాగా రూ.499తో బీఎస్ఎన్ఎల్ మార్కెట్లో లాంచ్ చేసిన ఈ ప్లాన్ రిలయన్స్ జియో ప్లాన్‌కు పెద్ద ఎదురుదెబ్బ అని మార్కెట్ విశ్లేషషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే బీఎస్ఎన్ఎల్, Reliance Jio రెండు సంస్థలు వినియోగదారులకు అందిస్తున్న వ్యాలిడిటీ 90 రోజులు. కానీ ఈ రెండు స్పెషల్ రీఛార్జ్ ప్లాన్స్ ధరలలో వ్యత్యాసం రూ.100 మేర ఉంది. ఈ రీఛార్స్ ప్లాన్స్ పూర్తి వివరాలు మీకోసం అందిస్తున్నాం.
Also Read: Gold Rate Today In Hyderabad 21 June 2021: మళ్లీ పతనమైన బంగారం ధరలు, నిలకడగా వెండి ధరలు ట్రేడింగ్
రిలయన్స్ జియో రూ.597 ప్రీపెయిడ్ ప్లాన్
రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్ (Jio Prepaid Recharge Plan) ధర రూ.597. 90 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్‌ను తీసుకొచ్చింది. వినియోగదారుల డేటా వినియోగం కోసం రోజువారీ డేటా పరిమితి లేకుండా నెట్ వినియోగించుకోవచ్చు. 75GBని సైతం రోజుల తరబడి ఎదురుచూడకుండా నిరంతరం డేటా వినియోగించుకునే అవకాశం కల్పించింది. ఈ రీఛార్జ్ ప్లాన్ ద్వారా వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ మరియు జియో యాప్స్ ఉచిత సబ్‌స్కిప్షన్‌ను వినియోగదారులకు అందిస్తోంది.
Also Read: Horoscope Today In Telugu: నేటి రాశి ఫలాలు 21 జూన్ 2021, ఓ రాశివారికి వాహనయోగం
ఇక బీఎస్ఎన్ఎల్ రూ.499 ప్రీపెయిడ్ ప్లాన్ విషయానికొస్తే ఇది కూడా 90 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంది. ఈ BSNL రీఛార్జ్ చేసుకుంటే వినియోగదారులకు రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. మొత్తం రోజులలలో వినియోగదారులు 180GB 4జీ డేటాను పొందుతారు. అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాలింగ్ (Unlimited Voice Calling) మరియు రోజుకు 100 SMS వినియోగదారులకు అందిస్తుంది. బీఎస్ఎన్ఎల్ ట్యూన్, జింగ్ వంటి సేవలను ఉచితంగా పొందవచ్చు.
జియో, బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్స్‌లో మీకు ధర వ్యాత్యాసం రూ.100 వరకు ఉంది. కానీ ప్రయోజనాలలో బీఎస్ఎన్ఎల్ బెస్ట్‌గా కనిపిస్తోంది. జియో రూ.597 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా మీకు 75 జీబీ డేటా లభిస్తుంది. బీఎస్ఎన్ఎల్ రోజుకు 2 జీబీ చొప్పున మొత్తం 180 జీబీ పొందుతారు. అంటే బీఎస్ఎన్ఎల్ ప్లాన్‌కు రూ.100 మేర తక్కువ అయినా 105 జీబీ ఇంటర్నెట్ డేటాను అధికంగా అందిస్తుంది. మీకు రోజువారీ డేటా పరిమితితో ఇబ్బంది లేకపోతే, మీరు BSNL నంబర్‌ను ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవచ్చు. లేదా తక్కువ సమయంలో అధిక డేటా వినియోగించుకోవాలనుకుంటే, రోజువారీ డేటా పరిమితి అనవసరం అనుకుంటే జియో ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవడం ఉత్తమం.
Also Read: SBI Customers Alert: ఎస్బీఐ ఖాతాదారులకు సరికొత్త సౌకర్యం, ఏ ఛార్జీలు వసూలు చేయరు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook