Corona Third Wave: థర్డ్‌వేవ్ హెచ్చరికలు జారీ..సిద్ధమైన ఏపీ ప్రభుత్వం

Corona Third Wave: కరోనా థర్డ్‌వేవ్ హెచ్చరికల నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం సమాయత్తమైంది. చిన్నారులకు సంబంధించిన అంశాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కోవిడ్ నివారణపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అధ్యక్షతన జరిగిన సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 15, 2021, 05:42 PM IST
Corona Third Wave: థర్డ్‌వేవ్ హెచ్చరికలు జారీ..సిద్ధమైన ఏపీ ప్రభుత్వం

Corona Third Wave: కరోనా థర్డ్‌వేవ్ హెచ్చరికల నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం సమాయత్తమైంది. చిన్నారులకు సంబంధించిన అంశాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కోవిడ్ నివారణపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అధ్యక్షతన జరిగిన సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

దేశంలో థర్డ్‌వేవ్ (Corona Third Wave)హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ నేపధ్యంలో ముందు జాగ్రత్త చర్యలకు సిద్ధమైంది ఏపీ ప్రభుత్వం. కోవిడ్ నివారణపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అధ్యక్షతన జరిగిన సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పీడియాట్రిక్ అంశాల్లో వైద్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణకై ఏర్పాట్లు చేశారు. చిన్నారులకు వైద్యం అందించేందుకు అదనంగా వైద్యులు, సిబ్బందిని నియమించాలని..జనావాసాలకు చేరువలో హెల్త్ హబ్‌లు  ఏర్పాటు చేయాలని వైఎస్ జగన్ (Ap cm ys jagan) సూచించినట్టు మంత్రి ఆళ్ల నాని ( Alla Nani) తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో చిన్నారులకు వైద్యం కోసం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా హాస్పటల్స్‌ను పరిశీలించాలని అధికారులను కోరారు. 

చిన్నారుల వైద్యానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని తెలిపారు. థర్డ్‌వేవ్‌కు అవసరమైన మందుల్ని అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు వ్యాక్సినేషన్ (Vaccination) కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలన్నారు. అర్హులైన తల్లులకు ఒకరోజు ముందే టోకెన్లు పంపిణీ చేయాలన్నారు. బ్లాక్ ఫంగస్ (Black Fungus) సోకినవారికి మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఆళ్ల నాని ( Alla Nani) ఆదేశించారు. ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 

Also read: Papikondalu Tourism: పాపికొండలు పర్యాటకానికి గ్రీన్ సిగ్నల్, త్వరలో ప్రారంభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News