ED Raids At TRS MP Nama Nageswara Rao House | టీఆర్ఎస్ నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఆస్తులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) అధికారులు ఆకస్మికంగా సోదాలు చేపట్టారు. వెయ్యి కోట్ల మేర రుణాలు తీసుకుని బ్యాంకులను మోసం చేశారన్న అభియోగాలతో ఈ తనిఖీలు చేపట్టినట్లు ఈడీ అధికారులు చెబుతున్నారు.
టీఆర్ఎస్ లోక్‌సభ పక్షనేత నామా నాగేశ్వరరావు రూ.1000 కోట్ల మేర రుణాలు తీసుకుని మోసం చేశారని అభియోగాలున్నాయి. ఈ క్రమంలో నేటి ఉదయం హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ (TRS) నేత నామా నాగేశ్వరరావు నివాసంలో, ఆయనకు చెందిన మధుకాన్ గ్రూప్ సంస్థలలో ఏకకాలంలో ఈడీ తనిఖీలు జరుపుతోంది. మధుకాన్ డైరెక్టర్ ఇళ్లతో పాటు రాంకీ ఎక్స్‌ప్రెస్ హైవే లిమిటెడ్‌కు సంబంధించిన వ్యక్తుల ఇళ్లు, ఆస్తులపై తనిఖీలు నిర్వహిస్తున్నారు.
Also Read: TS EAMCET 2021: మరోసారి టిఎస్ ఎంసెట్ ఎగ్జామ్స్ దరఖాస్తు గడువు పెంపు
మధుకాన్ గ్రూప్ సంస్థలు, రాంకీ ఎక్స్‌ప్రెస్ సంస్థల పేరిట రుణాలు తీసుకుని వాటిని దారి మళ్లించారని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ (Hyderabad)లోని నామా నాగేశ్వరరావు నివాసం, ఆస్తులతో పాటు రాంకీ ఎక్స్‌ప్రెస్‌వే సీఎండీ కె. శ్రీనివాస్, కంపెనీ డైరెక్టర్ల నివాసాల్లోనూ ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. వీరి ఇళ్లల్లో, ఆఫీసులలో కీలక డాక్యుమెంట్లు సేకరిస్తున్నారు.
Also Read: Bank Timings In Telangana: లాక్డౌన్లో తెలంగాణ బ్యాంకుల టైమింగ్స్ ఇవే, ఈ 19 వరకు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook