Pradhan Mantri Garib Kalyan Anna Yojna: కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఇండియాలో తగ్గుతోంది. అయితే కరోనా కారణంగా ఎన్నో లక్షల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. వీరందరికి బాసటగా నిలిచే ప్రకటన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేశారు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను దీపావళి వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.
దేశంలోని 80 కోట్ల ప్రజలకు నవంబర్ (Deepawali) వరకు ప్రతినెలా ఉచితంగా బియ్యం అందించనున్నారు. కరోనా సెకండ్ వేవ్ (India Corona Cases) నేపథ్యంలో తొలుత మే, జూన్ రెండు నెలలకుగానూ ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా కారణంగా కోట్ల మంది జీవనాధారం కోల్పోయారని వారికి ఓ సన్నిహితుడిగా, స్నేహితుడిగా తాను ఉంటానని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. కోవిడ్19ను నిర్మూలించేందుకు కలసికట్టుగా పోరాటం ఇలాగే కొనసాగిద్దామని పిలుపునిచ్చారు.
Also Read: India Corona Cases Updates: ఇండియాలో లక్ష దిగువకు కరోనా కేసులు, 3.5 లక్షలు దాటిన కోవిడ్-19 మరణాలు
ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం జాతీయ ఆహార భద్రత చట్టం, 2013 (National Food Security Act) ప్రకారం 80 కోట్ల మంది దేశం ప్రజలకు ప్రతి ఒక్కరికి నెలకు 5 కిలోల చొప్పున బియ్యం లేదా గోధుమలు అందిస్తున్నారు. అంత్యోదయ అన్నయోజన పథకం (Antyodaya Anna Yojana), ప్రియారిటీ హౌస్‌హోల్డర్స్‌కు ఉచితంగా బియ్యం/గోధుమలు పంపిణీ చేస్తారు. ప్రస్తుతం దేశంలో కోవిడ్-19 (Covid-19) తగ్గుముఖం పడుతోంది.
Also Read: IBPS RRB Notification 2021: 10,493 పోస్టులకు ఐబీపీఎస్ నోటిఫికేషన్, పూర్తి వివరాలు
కేంద్ర ప్రభుత్వం 2020-21 కాలానికిగానూ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం పేజ్ 1 కింద ఏప్రిల్ నుంచి జూన్ 2020 వరకు, మరియు పీఎంజీకేఏవై ఫేజ్ 2 కింద జూలై నుంచి నవంబర్ 2020 వరకు దీని ద్వారా 104 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు మరియు 201 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, మొత్తం 305 టన్నుల ఆహారధాన్యాలు ఉచితంగా అందించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook