Sputnik v vaccine: కరోనా మహమ్మారి నియంత్రణకు వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించింది కేంద్ర ప్రభుత్వం. వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచేందుకు సీరమ్ ఇనిస్టిట్యూట్‌కు మరో వ్యాక్సిన్ ఉత్పత్తికి అనుమతి లభించింది.
కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) ధాటికి దేశ ప్రజలు అల్లాడుతున్నారు. కరోనా మహమ్మారి కట్టడికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గంగా ఉంది. దేశంలో ప్రస్తుతం రెండే వ్యాక్సిన్లు అందుబాటులో ఉండగా..ఇటీవల స్పుత్నిక్ వి వ్యాక్సిన్ మార్కెట్లో వచ్చింది. రష్యాలోని గమలేయా సంస్థ అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ఉత్పత్తికి ఇప్పటికే డాక్టర్ రెడ్డీ ల్యాబ్స్ ఒప్పందం కుదుర్చుకోగా..ఇప్పుడు మరో ప్రముఖ వ్యాక్సిన్ ఉత్పత్తిదారైన సీరమ్ ఇనిస్టిట్యూట్‌తో ఒప్పందమైంది. సీరమ్ ఇనిస్టిట్యూట్ (Serum Institute) సంస్థ ఇప్పటికే ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను( Oxford- AstraZeneca Vaccine) కోవిషీల్డ్ పేరుతో ఉత్పత్తి చేసి పంపిణీ చేస్తోంది.
ఇప్పుడు గమలేయా ఇనిస్టిట్యూట్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ స్పుత్నిక్ వి(Sputnik v vaccine) ఉత్పత్తికి సీరమ్ ఇనిస్టిట్యూట్ ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి భారత ఔషధ నియంత్రణ సంస్థ అయిన డీసీజీఐ అనుమతిచ్చింది. ప్రస్తుతానికి ప్రాథమిక అనుమతి మాత్రమే ఇచ్చామని..తయారీకు కొన్ని నెలల సమయం పడుతుందని డీసీజీఐ (DCGI)వెల్లడించింది. అయితే సీరమ్ ఇనిస్టిట్యూట్‌కు ఈ వ్యాక్సిన్ విక్రయాలకు అనుమతి లేదు. డీసీజీఐ అనుమతి తరువాత జెనెటిక్ మానిఫ్యులేషన్ రివ్యూ కమిటీ అనుమతివ్వాల్సి ఉంది. సెల్ బ్యాంక్ దిగుమతి, వైరస్ స్టాక్ విరాల సేకరణ, భద్రపర్చడం వంటివాటిని కమిటీకు సూచించాల్సి ఉంటుంది. దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవ్యాగ్జిన్, కోవిషీల్డ్‌తో పోలిస్తే..స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌కు 91.6 శాతం సామర్ధ్యముంది.
Also read: Delta Variant: యూకేలో ప్రమాద ఘంటికలు మోగిస్తున్న కరోనా డెల్టా వేరియంట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Sputnik v vaccine: స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ఇక సీరమ్ నుంచి ఉత్పత్తి, డీసీజీఐ అనుమతి