First White fungus case in Delhi: న్యూ ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఫస్ట్ వైట్ ఫంగస్ కేసు నమోదైంది. పొత్తి కడుపులో నొప్పితో పాటు మలబద్ధకం సమస్యలతో ఓ 49 ఏళ్ల మహిళ ఇటీవల సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరారు. ఆమెకు గతంలోనే కరోనా వైరస్తోనూ బాధపడ్డారు. ఆ మహిళకు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. ఆమె వైట్ ఫంగస్ (White fungus) బారినపడినట్టు నిర్థారించారు. ఢిల్లీలో తొలి వైట్ ఫంగస్ కేసుగా నమోదు చేసిన డాక్టర్లు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. వైట్ ఫంగస్ (White fungus symptoms) లక్షణాలతో బాధపడుతున్న మహిళకు శస్త్ర చికిత్స చేశామని, ప్రస్తుతం ఆమె కోలుకుంటోందని డాక్టర్లు తెలిపారు.
బ్లాక్ ఫంగస్‌తో పోలిస్తే, వైట్ ఫంగస్ వల్ల కలిగే నొప్పి తక్కువగానే ఉంటుందని.. అయితే సరైన సమయంలో వైట్ ఫంగస్‌ని (How to test White fungus) గుర్తించి చికిత్స తీసుకోకపోతేనే పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుందని ఆమెకు శస్ర్తచికిత్స చేసిన డాక్టర్ల బృందానికి నేతృత్వం వహించిన సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ అండ్ లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ విభాగం సలహాదారుడు ప్రొఫెసర్ సమిరన్ నుండి తెలిపారు.
Also read : India Corona Cases Today: భారత్‌లో 44 రోజుల కనిష్టానికి కరోనా పాజిటివ్ కేసులు
మే 13న ఆ మహిళ ఆస్పత్రిలో చేరారు. అంతకంటే ముందు బ్రెస్ట్ క్యాన్సర్‌తో (Breast cancer) బాధపడుతున్న ఆమెకు క్యాన్సర్ చికిత్సలో భాగంగా బ్రెస్ట్ తొలగించారు. నాలుగు వారాల ముందు వరకు ఆమె కీమోథెరపీ చికిత్స తీసుకున్నారు. ఇలా వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్నందున మహిళకు చికిత్స సైతం క్లిష్టంగా మారిందని ప్రొఫెసర్ సమిరన్ పేర్కొన్నారు. ఆమెకు చికిత్స అందించిన మరో డాక్టర్ అనిల్ అరోరా మాట్లాడుతూ.. ఆమె పొత్తి కడుపు భాగం నుంచి దాదాపు లీటర్ వరకు చీము తొలగించినట్టు తెలిపారు. రెండు, మూడు రకాల శస్త్రచికిత్సల అనంతరం ప్రస్తుతం మహిళ వైట్ ఫంగస్ (White fungus symptoms and treatment) నుంచి కోలుకుంటున్నట్టు డాక్టర్లు తెలిపారు.
గతంలో బీహార్ రాజధాని పాట్నాలో నలుగురు వైట్ ఫంగస్ (First white fungus case in India) బారినపడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచే దేశంలో వైట్ ఫంగస్ కేసుల గురించి తొలిసారిగా వెలుగులోకొచ్చింది. ఇప్పటికే కరోనా కేసులు, బ్లాక్ ఫంగస్ కేసులతో (Black fungus cases in Delhi) బాధపడుతున్న ఢిల్లీలో తాజాగా వైట్ ఫంగస్ కేసు కూడా నమోదైన నేపథ్యంలో ఢిల్లీ సర్కారు మరింత అప్రమత్తమైంది.
Also read : Pfizer, Moderna and J&J vaccines: ఫైజర్, మొడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ల
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook