Ap Covid19 Update: కరోనా మహమ్మారి నియంత్రణకై పలు రాష్ట్రాల్లో అవలంభిస్తున్న లాక్డౌన్, కర్ఫ్యూలు నెమ్మది నెమ్మదిగా ఫలితాలినిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య క్రమేపీ తగ్గుతోంది. మరోవైపు ఏపీలో భారీ ఎత్తున పరీక్షలు చేస్తున్నారు.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ( Corona Second Wave) ధాటికి జనజీవనం అస్తవ్యస్థమైపోయింది. కరోనా విపత్కర పరిస్థితులతో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు చాలా రాష్ట్రాలు లాక్డౌన్, కర్ఫ్యూ బాటపట్టాయి. దాంతో కరోనా కేసుల సంఖ్య క్రమేపీ తగ్గుముఖం పట్టింది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Ap government) కరోనా నియంత్రణకై పగడ్బందీ చర్యలు చేపట్టింది. రోజుకు 18 గంటల సేపు కర్ఫ్యూ అమలు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తోంది.
మరోవైపు రాష్ట్రంలో భారీగా కరోనా నిర్ధారణ పరీక్షలు( Covid19 Tests) చేస్తోంది. రోజుకు 90 వేల నుంచి లక్ష వరకూ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. గత 24 గంటల్లో 91 వేల 253 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా..21 వేల 320 మందికి పాజిటివ్‌గా నిర్ధారణైంది. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బుల్లెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14 లక్షల 75 వేల 372కు పెరిగింది. గత 24 గంటల్లో 21 వేల 274 మంది రోగులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా..99 మంది మరణించారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 12 లక్షల 53 వేల 291 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2 లక్షల 11 వేల 501 కోవిడ్ యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 1 కోటి 81 లక్షల 40 వేల 307 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. రాష్ట్రంలో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 2 వేల 923 కొత్త కేసులు నమోదయ్యాయి. అటు అనంతపురం జిల్లాలో 2 వేల 804 కేసులు వెలుగు చూశాయి. గత 24 గంటల్లో చిత్తూరు, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో అత్యధికంగా పది మంది చొప్పున మరణించారు.
Also read: AP Assembly Budget Session: అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ గైర్హాజరు కానుందా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook