Covid Medicine Release: కరోనాకు సరికొత్త మందు మార్కెట్‌లో వచ్చేసింది. డాక్టర్ రెడ్డీస్ , డీఆర్డీవో సంయుక్తంగా అభివృద్ధి చేసిన 2 డిజీ మెడిసిన్ గేమ్ ఛేంజర్ కానుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కరోనా మహమ్మారికి విరుగుడు వచ్చేసింది. కరోనా వైరస్ నియంత్రణకు తొలి మెడిసిన్‌గా భావిస్తున్న 2 డీజీ మెడిసిన్ ( 2 DG Medicine) మేకిన్ ఇండియా కావడం విశేషం. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ( Dr Reddys labs), డీఆర్డీవో (DRDO) కలిసి సంయుక్తంగా ఈ మందును అభివృద్ధి చేశాయి. నోటి ద్వారా తీసుకునే ఈ మందు పౌడర్ రూపంలో ఉంటుంది. ఓ మోస్తరు నుంచి వ్యాధి తీవ్రత అధికంగా ఉండే రోగులకు చికిత్సలో వాడటానికి ఈ మందు ఉపయోగపడుతుంది. ఈ కోణంలోనే భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐ అనుమతించింది. 2 డీ ఆక్సీ డీ గ్లూకోజ్ ( 2 De oxy De glucose) మందును కరోనా బాధితులు త్వరగా కోలుకునేందుకు ఉపయోగపడుతుంది. రోగులకు ఆక్సిజన్ పెట్టాల్సిన అవసరాన్ని కూడా ఈ మందు తగ్గిస్తుందని క్లినికల్ ట్రయల్స్‌లో తేలిందని రక్షణ శాఖ తెలిపింది.
2 డీజీ మందుకు సంబంధించిన తొలి బ్యాచ్‌ను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ( Rajnath singh )ఇవాళ విడుదల చేశారు. త్వరలో ఇది పూర్తి స్థాయిలో మార్కెట్‌లో రానుంది. కరోనా చికిత్సలో సత్ఫలితాలనిస్తే నిజంగా ఇదొక గేమ్ ఛేంజర్ కానుంది.
Also read: India Covid-19 Cases: దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు, ఆందోళన పెంచుతున్న కరోనా మరణాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Covid Medicine Release: మేకిన్ ఇన్ ఇండియా కోవిడ్ మెడిసిన్ 2 డీజీ విడుదల