Tauktae Cyclone: అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుపాన్ గుజరాత్ దిశగా కదులుతోంది. తౌక్టే తుపాన్ ప్రభావంతో ఇప్పటికే కేరళ, గోవా, మహారాష్ట్ర, లక్షద్వీప్‌లలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
అరేబియా సముద్రంలో(Arabian Sea) ఏర్పడిన తౌక్టే తుపాను ఈ నెల 18 వ తేదీన గుజరాత్ వద్ద తీరం దాటనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గుజరాత్ రాష్ట్రంలోని పోర్ బందర్-మహువా తీరం వద్ద ఈ నెల 18వ వేకువ జామున తీరం దాటే అవకాశముందని ఐఎండీ (IMD) తెలిపింది. తుపాను ప్రభావంతో ఇప్పటికే మహారాష్ట్ర, కేరళ, గోవా, లక్షద్వీప్‌లలో భారీ వర్షాలు పడుతున్నాయి. తీరప్రాంతాల్లో 53 ఎన్డీఆర్ఎఫ్ బృందాల్ని మొహరించారు. ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తున్న తౌక్టే తుపాను గోవాకు ఉత్ర వాయువ్య ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. భారీ ఎత్తున ఈదురుగాలులు, వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది.తుపాను ప్రభావంతో కర్ణాటకలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. గత 24 గంటల్లో 6 జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలతో ఇప్పటికే నలుగురు మృతి చెందారు. కర్నాటకలో 73 గ్రామాలపై తౌక్టే తుపాను ప్రభావం చూపనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Pm Narendra Modi) సైతం తుపానుపై సమీక్షించారు. తీర ప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రాంతాలను తరలించాలని సూచించారు.
తౌక్టే తుపాను(Tauktae Cyclone) ప్రభావం ఎలా ఉందనే విషయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit shah) సమీక్షించారు. వివిధ రాష్ట్రాలు, యూటీలు, ఏజెన్సీ సంస్థలతో సన్నద్ధత వ్యవహారమై చర్చించారు. సమావేశంలో మహారాష్ట్ర, గుజరాత్ ముఖ్యమంత్రులు, డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలి అధికారులు పాల్గొన్నారు.
Also read: India Corona News: దేశంలో మరోసారి 4 వేల కరోనా మరణాలు, పాజిటివ్ కన్నా డిశ్ఛార్జ్ కేసులు అధికం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook