IPL 2021 మధ్యలో నిలిచిపోవడానికి వారిదే తప్పిదమా, ఆసక్తికర విషయాలు

IPL 2021 Players COVID-19 Vaccine: కొన్ని ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లను ఎలాగైనా ఒప్పించి కరోనా టీకాలు ఇప్పించాలని భావించాయట. ఐపీఎల్ 2021 ప్రారంభానికి ముందుగానే ఆటగాళ్లకు కరోనా టీకాలు ఇప్పించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI), ఇండియన్ ప్రీలియర్ లీగ్ (IPL) నిర్వాహకులు భావించినట్లు తెలుస్తోంది. 

Written by - Shankar Dukanam | Last Updated : May 16, 2021, 12:02 PM IST
IPL 2021 మధ్యలో నిలిచిపోవడానికి వారిదే తప్పిదమా, ఆసక్తికర విషయాలు

ఆటగాళ్లతో పాటు మైదాన సిబ్బంది, కోచ్‌లకు కరోనా సోకడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ మధ్యలోనే ఆపివేయడం తెలిసిందే. అయితే గత 13 సీజన్లలో మధ్యలో నిలిచిపోని ఐపీఎల్, తొలిసారిగా కరోనా కారణంగా ఐపీఎల్ 2021 (IPL 2021) నిరవధిక వాయిదా పడింది. సెప్టెంబర్ నెలలో ఐపీఎల్ తాజా సీజన్ మిగతా మ్యాచ్‌లు నిర్వహిస్తారని సైతం ప్రచారం జరిగింది.

ఐపీఎల్ 14వ సీజన్‌కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు ఆలస్యంగా వెలుగుచూశాయి. ఐపీఎల్ 2021 ప్రారంభానికి ముందుగానే ఆటగాళ్లకు కరోనా టీకాలు ఇప్పించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI), ఇండియన్ ప్రీలియర్ లీగ్ (IPL) నిర్వాహకులు భావించినట్లు తెలుస్తోంది. అయితే వ్యాక్సిన్లు వేసుకున్నాక స్వల్ప జ్వరం, ఒళ్లు నొప్పులు లాంటి లక్షణాలు వస్తాయని విన్న ఆటగాళ్లు కోవిడ్-19(Covid-19) టీకాలు తీసుకోవడానికి నిరాకరించారని టైమ్స్ ఆఫ్ ఇండియా తాజాగా రిపోర్ట్ చేసింది. టీకాలు తీసుకోకుండానే ఐపీఎల్ ఆడతామని ఆటగాళ్లు చెప్పారని, వారిని తప్పు పట్టాల్సిన అవసరం లేదని, కేవలం కరోనా వ్యాక్సిన్లపై అవగాహనా లేకపోవడం వల్ల టీకాలు తీసుకోవడానికి ఆసక్తి చూపించలేదని ఓ అధికారి టీఓఐకి తెలిపారు.

Also Read: Bhuvneshwar Kumarకు టెస్ట్ క్రికెట్ బోర్ కొట్టిందా, ఘాటుగా స్పందించిన భారత పేసర్

కొన్ని ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లను ఎలాగైనా ఒప్పించి కరోనా టీకాలు ఇప్పించాలని భావించాయట. కానీ ఆటగాళ్లు తాము బయో బబుల్ వాతావరణంలో ఉండబోతున్నామని, కనుక తమకు ఏ ఇబ్బంది ఉండదని చెప్పానట్లు తెలుస్తోంది. ఆటగాళ్లకు ఇష్టం లేకుండా కోవిడ్19 టీకాలు ఇప్పించేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు. అనూహ్యంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఏకంగా ఐపీఎల్ 2021(IPL 2021) మధ్యలోనే నిలిచిపోయింది. ప్రత్యేక విమానాలలో ఆటగాళ్లు భారత్ చేరుకున్నారు కనుక వారి విషయంలో ఆందోళన అవసరం లేదని ఫ్రాంచైజీలు కూడా వెనక్కి తగ్గాయని, అందుకు ఆటగాళ్లే కారణమి తాజా రిపోర్టులు వైరల్ అవుతున్నాయి. 

Also Read: Rashmika Mandannaకు ఐపీఎల్‌లో ఫెవరెట్ టీమ్ RCB, ఆ సీనియర్ క్రికెటర్ అంటే పిచ్చి

ఐపీఎల్ తాజా సీజన్‌ దాదాపు సగం పూర్తయింది. మరో 31 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. సెప్టెంబర్ నెలలో ఐపీఎల్ 2021 మిగతా మ్యాచ్‌ల నిర్వహణకు బీసీసీఐ, ఐపీఎల్ నిర్వాహకులు సిద్ధంగా ఉన్నారు. కానీ ఆ సమయంలో విదేశీ ఆటగాళ్లు ఏ మేర అందుబాటులో ఉంటారో చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. అక్టోబర్, నవంబర్ నెలలో టీ20 ప్రపంచ కప్ నిర్వహణకు ఐసీసీ ఏర్పాట్లు చేస్తోంది. పొట్టి ప్రపంచ కప్ కోసం జాతీయ జట్టుతో కలిసి ఉండేందుకు ఆటగాళ్లతో పాటు ఆ దేశాల క్రికెట్ బోర్డులు ఆసక్తి చూపుతున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News