India Corona Cases: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్‌లో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇదివరకే పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ, పాక్షిక కర్ఫ్యూ అమలుచేస్తున్నా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. వరుసగా రెండోరోజు కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదయ్యాయి. కోవిడ్19 మరణాలు సైతం వరుసగా రెండోరోజు 4 వేలు పైగా నమోదు కావడం ఆందోళన పెంచుతోంది.
దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 3,62,727 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి భారత్‌లో ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,37,03,665 (2 కోట్ల 37 లక్షల 3 వేల 6 వందల 65)కు చేరింది. అదే సమయంలో గడిచిన 24 గంటల్లో 4,120 మంది కరోనాతో మరణించారు. భారత్‌లో వరుసగా రెండోరోజు 4 వేలకు పైగా మరణాలు సంభవించడం కరోనా ప్రస్తుత పరిస్థితికి నిదర్శనం. దేశంలో కరోనా వైరస్(CoronaVirus) బారిన పడి ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 2,58,317కి చేరింది. దేశ వ్యాప్తంగా నిన్న ఒక్కరోజు 3,52,181 మంది కరోనా మహమ్మారిని జయించారు.
Also Read: Dead Bodies In Ganga: నదిలో COVID-19 మృతదేహాలు, వైరస్ వ్యాప్తిపై నిపుణులు ఏమన్నారంటే
India reports 3,62,727 new #COVID19 cases, 3,52,181 discharges and 4,120 deaths in the last 24 hours, as per Union Health Ministry
Total cases: 2,37,03,665
Total discharges: 1,97,34,823
Death toll: 2,58,317
Active cases: 37,10,525Total vaccination: 17,72,14,256 pic.twitter.com/2hCw318J4T
— ANI (@ANI) May 13, 2021
భారత్‌లో ఇప్పటివరకూ కరోనాను జయించిన వారి సంఖ్య 1,97,34,823 (ఒక కోటి 97 లక్షల 34 వేల 8 వందల 23)కి చేరింది. దేశంలో ప్రస్తుతం 37 లక్షల 10 వేల 525 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. డిశ్ఛార్జ్ కేసులకన్నా పాజిటివ్ కేసులే అధికంగా నమోదయ్యాయి. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ అంతగా వేగం పుంజుకున్నట్లు కనిపించడం లేదు. 18 నుంచి 44 ఏళ్ల వారికి టీకాలు పలు రాష్ట్రాల్లో ఇవ్వడం లేదు. దేశంలో ఇప్పటివరకూ 17 కోట్ల 72 లక్షల 14 వేల 2 వందల 56 మందికి కోవిడ్-19(COVID-19) టీకాలు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది.
Also Read: Sonu Soodకు థ్యాంక్స్ చెప్పిన Harbhajan Singh ,మొన్న రైనాకు, నిన్న హర్భజన్‌కు సాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook