Ap Corona Update: కరోనా మహమ్మారి విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రతి నిత్యం భారీగా కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకూ దేశంలో కరోనా పరిస్థితులు దిగజారిపోతున్నాయి. తాజాగా ఏపీలో నమోదైన కేసుల వివరాలివీ..
దేశంలో కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) శరవేగంగా వ్యాపిస్తోంది. వరుసగా నాలుగు రోజుల పాటు 4 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా..తాజాగా గత 24 గంటల్లో కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. 3 లక్షల 66 వేల కేసులు నమోదయ్యాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో కూడా నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య కాస్త తగ్గింది. గత 24 గంటల్లో ఏపీలో 60 వేల కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా..14 వేల 986 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇందులో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 2 వేల 352 కేసులు నమోదు కాగా..విశాఖపట్నంలో 1618 కేసులు, గుంటూరులో 1575, చిత్తూరులో 1543, నెల్లూరులో 1432 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన కేసుల సంఖ్య 13 లక్షల 2 వేల 589 కు చేరుకుంది.
మరోవైపు కరోనా (Corona virus) కారణంగా రాష్ట్రంలో గత 24 గంటల్లో 86 మంది ప్రాణాలు కోల్పోయారు.ఇందులో పశ్చిమ గోదావరి జిల్లాలో 12, గుంటూరులో 12, తూర్పు గోదావరి జిల్లాలో 10, విశాఖపట్నంలో 10, నెల్లూరులో 8, విజయవాడలో 8 మంది ఉన్నారు. మొత్తం కరోనా మరణాల సంఖ్య రాష్ట్రంలో 8 వేల 791కు చేరుకుంది. గత 24 గంటల్లో ఏపీలో 16 వేల మంది కోలుకున్నారు. కాగా ఇప్పటి వరకూ 11 లక్షల 4 వేల 431 మంది కోలుకున్నారు.ఇక ఏపీలో ప్రస్తుతం 1 లక్షా 89 వేల 367 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నియంత్రణకు రాష్ట్రంలో ముందు నైట్‌కర్ఫ్యూ(Night Curfew) అమలు చేయగా ఇప్పుడు కర్ఫ్యూ (Curfew)పాటిస్తున్నారు. ఉదయం 6 గంటల్నించి మద్యాహ్నం 12 గంటల వరకూ మాత్రం రాకపోకలు, వ్యాపార, వాణిజ్యాలకు అనుమతి ఉంది.
Also read: Covid Vaccine: వ్యాక్సిన్ కొనుగోలుపై స్పష్టత ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook