India Covid Status: దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంపై కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా చెన్నై, బెంగళూరుల్లో పరిస్థితి దారుణంంగా ఉందని చెబుతోంది.
కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave) దేశంలో అతి భయంకరంగా వ్యాపిస్తోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలోనే కేసులు నమోదవుతున్నాయి. ఓ వైపు కేసుల సంఖ్య పెరుగుతుంటే మరోవైపు పరిస్థితులు దిగజారుతున్నాయి. ప్రజనీకం తీవ్ర ఇబ్పందులు పడుతోంది. దేశంలో కరోనా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య శాఖ (Union Health Ministry) జాయింట్ సెక్రటరీ సమీక్ష నిర్వహించారు. నిన్నటి కంటే ఇవాళ 2.4 శాతం కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయని జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ (Lav Agarwal) తెలిపారు.ముఖ్యంగా 12 రాష్ట్రాల్లో లక్ష కంటే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. అసోం, గోవా, మణిపూర్‌లలో కొత్తగా కేసులు పెరుగుతున్నాయన్నారు. మహారాష్ట్ర, కర్నాటక, కేరళ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్ , పశ్చిమ బెంగాల్, బీహార్, హర్యానా రాష్ట్రాల్లో ప్రస్తుతం లక్ష చొప్పున యాకివ్ కేసులున్నాయి.
ముఖ్యంగా దేశంలో బెంగళూరు(Bengaluru), చెన్నై(Chennai), గురుగ్రామ్(Gurugram)లలో పరిస్థితి దారుణంగా ఉందని లవ్ అగర్వాల్ వెల్లడించారు. బెంగళూరులో అయితే ప్రతి ఇద్దరిలో ఒకరికి పాజిటివ్ వస్తోందని చెప్పారు. దేశంలోని 7 రాష్ట్రాల్లో 50 వేల నుంచి లక్ష యాక్టివ్ కేసులు ఉన్నాయి. 50 వేల కంటే తక్కువ యాక్టివ్ కేసులున్న రాష్ట్రాలు 17 ఉన్నాయి. గత వారం రోజుల వ్యవధిలో ఒక్క బెంగళూరులోనే లక్షన్నరకు పైగా కేసులు నమోదయ్యాయి. మరోవైపు పాజిటివిటీ రేటు 50 శాతం కంటే ఎక్కువే ఉంది. తమిళనాడులో(Tamilnadu) 38 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. కోజికోడ్, ఎర్నాకులం, గురుగ్రామ్ జిల్లాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.
Also read: Lockdown Details: దేశంలో ఎక్కడెక్కడ, ఎప్పటి వరకూ లాక్‌డౌన్, నైట్‌కర్ప్యూ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook