Health Tips: రాత్రివేళ ఈ ఆహార పదార్థాలు, Fruits తినకూడదు, అందుకు కారణాలు ఇవే

Health Tips In Telugu | కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని విని తింటుంటాం. కానీ అది ఏ సమయంలో, ఏ కాలంలో తినడం వల్ల లాభం, ఎప్పుడు తింటే నష్టం జరుగుతుందని సైతం తెలుసుకోవాల్సి ఉంటుంది. అసలే కరోనా టైమ్ నడుస్తుంది. కనుక అరటి పండ్లు, యాపిల్స్, కీరదోస లాంటి పండ్లు, పదార్థాలు, మంసాహారం తమకు వీలు చిక్కిన సమయంలో ఆరగిస్తున్నారు. అయితే కొన్ని పదార్థాలు, పండ్లు రాత్రివేళ తింటే ఆరోగ్యం కన్నా అనర్థమే జరుగుతుందని తెలుసా. ఆ వివరాలు మీకోసం.

1 /8

Health Tips In Telugu | కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని విని తింటుంటాం. కానీ అది ఏ సమయంలో, ఏ కాలంలో తినడం వల్ల లాభం, ఎప్పుడు తింటే నష్టం జరుగుతుందని సైతం తెలుసుకోవాల్సి ఉంటుంది. అసలే కరోనా టైమ్ నడుస్తుంది. కనుక అరటి పండ్లు, యాపిల్స్, కీరదోస లాంటి పండ్లు, పదార్థాలు, మంసాహారం తమకు వీలు చిక్కిన సమయంలో ఆరగిస్తున్నారు. అయితే కొన్ని పదార్థాలు, పండ్లు రాత్రివేళ తింటే ఆరోగ్యం కన్నా అనర్థమే జరుగుతుందని తెలుసా. ఆ వివరాలు మీకోసం. (Photo: thehealthsite) Also Read: CT Scan For COVID Patients: సీటీ స్కాన్ వల్ల భవిష్యత్తులో క్యాన్సర్ ముప్పు, AIIMS డైరెక్టర్ సంచలన విషయాలు

2 /8

అధికంగా నీటి శాతాన్ని కలిగి ఉండే ఆహార పదార్ధాలు, కూరగాయలు రాత్రివేళ తీసుకోకూడదు. లేదంటే సాయంత్రం తరువాత వీలైనంత త్వరగా రాత్రి భోజనం తింటే ఏ సమస్యా ఉండదు. అయితే నీటి శాతం అధికంగా ఉండే కీరదోస, పుచ్చకాయ లాంటివి తింటే మూత్రవిసర్జనకు పదే పదే బాత్రూమ్‌కు వెళ్లాల్సి వస్తుంది. దీని వల్ల మీకు నిద్ర సమస్య వస్తుంది. మరుసటి పనులు చురుకుగా చేసుకోలేరు. (Photo: thehealthsite)

3 /8

రాత్రివేళ, మరీ ముఖ్యంగా నిద్రించడానికి ముందు కారం, మసాలా ఎక్కువగా ఉండే పదార్థాలు (Spicy Foods) తినకూడదు. దానివల్ల గుండెలో మంట, ఇతరత్రా అనారోగ్య సమస్యలు వస్తాయి. శరీరంలో వేడి అధికమైన మీకు ఇతర అవయవాలపై ప్రభావం చూపుతుంది. నిద్రకు సైతం భంగం వాటిల్లే అవకాశాలున్నాయని పలు అధ్యయనాలలో తేలింది. (Photo: thehealthsite) Also Read: Risk Factors For Covid-19: కరోనా వీరికి సోకితే మరింత ప్రమాదకరం.. ప్రాణాలు కూడా పోతాయి

4 /8

చిన్నారులు, యువత చాక్లెట్లు ఎక్కువగా తింటారు. చర్మ సంరక్షణలో చాక్లెట్లు ప్రభావం చూపుతాయని వీటిని తినే అమ్మాయిలు కూడా ఉంటారు. అయితే రాత్రివేళ, అది కూడా నిద్రించే ముందు డార్క్ చాక్లెట్(Dark Chocolate) గుండె సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది. ఇందులో కెఫైన్, అమైనో ఆమ్లాలు మిమ్మల్ని మరింత యాక్టివ్ చేస్తాయి. కనుక డార్క్ చాక్లెట్ తినే వారికి రాత్రివేళ నిద్రాభంగం జరుగుతుంది. పదే పదే మెలకువ రావడంతో నిద్రలేమి సమస్య వస్తుంది. (Photo: thehealthsite)

5 /8

మీరు రాత్రివేళ బ్రకోలి, క్యాలిఫ్లవర్ తింటున్నారా.. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ రకం ఫైబర్ నీటిలో సులభంగా కరగదు. దాంతో వీటిని తిన్నవారు అంత సులువగా ఆహారాన్ని జీర్ణం చేసుకోలేరు. కడుపు ఉబ్బరం, కడుపులో వికారం లాంటి లక్షణాలతో నిద్ర మధ్యలోనే మెళకువ వస్తుంది. నిద్రలేమి సమస్యకు దారితీస్తుంది.  (Photo: thehealthsite) Also Read: COVID-19 నుంచి రికవరీ అయినవాళ్లు తీసుకోవాల్సిన Food, ఇతర జాగ్రత్తలు

6 /8

ఏదైనా శారీరక శ్రమ చేయడానికి ముందు అరటి పండ్లు తినడం మంచిది. ఇందులో పొటాషియం అధికంగా లభిస్తుంది. చర్మాన్ని మెరుగు చేయడంతో పాటు మీ రోగనిరోధక శక్తిని సైతం అరటిపండ్లు మెరుగు చేస్తాయి. అయితే రాత్రివేళ అరటిపండ్లు తింటే అజీర్తి సమస్యలు వస్తాయి. (Photo: thehealthsite)

7 /8

యాపిల్ పళ్లలో పెక్టిన్ అనే ఫైబర్ అధిక మోతాదులో ఉంటుందని వైద్య నిపుణులు గుర్తించారు. ఇది రక్తంలో చక్కెర మోతాదును, కొవ్వును నియంత్రిస్తుంది. కానీ రాత్రివేళ యాపిల్ పండ్లు తింటే ఎసిడిటీకి దారితీస్తుంది. రాత్రివేళ ఆహారం, మరీ ముఖ్యంగా డిన్నర్ అయిన వెంటనే నిద్రించేవారు ఆ సమయంలో యాపిల్ తినకపోవడం ఆరోగ్యానికి శ్రేయస్కరం. (Photo: thehealthsite)

8 /8

బాదం, పిస్తా లాంటి నట్స్ తినేవారిలో రక్తపోటు సాధారణంగా ఉంటుంది. గుండె సంబంధిత సమస్యలకు బాదం, పిస్తా పరిష్కారం చూపుతాయి. కానీ వీటిలో అధిక మోతాదులో కొవ్వు, కెలోరీలు ఉంటాయి. కానీ రాత్రివేళ ఇవి తినడం వల్ల బరువు పెరిగి స్థూలకాయ సమస్య బారిన పడతారు. పగటివేళ వీటిని తినడం వల్ల ఏ సమస్య ఉండదు. (Photo: thehealthsite) స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook