/telugu/photo-gallery/rain-alert-expected-in-these-4-key-districts-of-telugu-states-imd-weather-alert-issued-rn-180901 AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక 180901

IPL 2021 Latest Updates: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020లో తీవ్రంగా నిరాశపరిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఏడాది గాడిలో పడినట్లు కనిపిస్తోంది. ఓటమితో సీజన్ ఆరంభించినప్పటికీ తొలి మూడు మ్యాచ్‌లలో 2 మ్యాచ్‌లు నెగ్గి ఐపీఎల్ 2021 టైటిల్ రేసులో సీఎస్కే ఉందని కెప్టెన్ ఎంఎస్ ధోనీ ప్రమాదకర సంకేతాలు పంపాడు. తొలి మ్యాచ్‌లో డకౌట్ అయ్యాక సైతం ధోనీకి మ్యాచ్‌లు అవసరమా, అతడు రిటైర్ కావడమే సరైన నిర్ణయమనే వాదనలు తెరపైకి వచ్చాయి.

మూడో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై 45 పరుగుల తేడాతో సీఎస్కే విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ఎంఎస్ ధోనీ దీనిపై స్పందించాడు. వయసు మీద పడటం, ఫిట్‌గా ఉండటం అనేది రెండు కష్టతరమైన అంశాలని అభిప్రాయపడ్డాడు. 39 ఏళ్ల ధోనీని అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ కావాలని ఒత్తిడి వచ్చినా కొన్నేళ్లపాటు కొనసాగి, గత ఏడాది ఐపీఎల్ 2020కు కొన్ని రోజుల ముందు టీ20, వన్డే ఫార్మాట్లకు సైతం రిటైర్మెంట్ ప్రకటించాడు. ఎవరైనా మ్యాచ్‌లు ఆడుతున్నారంటే నువ్వు ఫిట్‌గా ఉన్నావని ఇతరులు చెప్పాల్సిన పని లేదన్నాడు. యువ ఆటగాళ్లతో పోటీ పడాల్సి ఉంటుందని, అందుకు తానెప్పుడూ సిద్ధంగానే ఉన్నానని తెలిపాడు.

Also Read: Sri Lanka Cricketer Banned: శ్రీలంక క్రికెటర్ దిల్హారా లోకుహెట్టిగేపై 8 ఏళ్లపాటు నిషేధం విధించిన ఐసీసీ

ప్రదర్శన చేయడం అనే దానిపై గ్యారంటీ ఉండాలి. కానీ 24 ఏళ్ల వయసులో చేసిన ప్రదర్శన ఇప్పుడు ఇవ్వడం అనేది ఏ క్రికెటర్‌కైనా కష్టంగానే ఉంటుందన్నాడు. అదే సమయంలో 40 ఏళ్ల వయసులో ప్రదర్శన చేస్తామా లేదా అనేది చెప్పలేమని ఎంఎస్ ధోనీ తన మనసులో మాటలు బహిర్గతం చేశాడు. అదృష్టవశాత్తూ ప్రజలు నన్ను నువ్వు ఫిట్‌గా లేవు అని అనండం లేదని, అది తనకు సానుకూలాంశం అన్నాడు. 

మ్యాచ్ విషయానికొస్తే మోయిన్ అలీ అద్భుత ప్రదర్శన చేశాడని కొనియాడాడు. బ్యాట్‌తో రాణించిన మోయిన్ అలీ బౌలింగ్‌లో మరింత సత్తా చాటాడు. మూడు ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 7 పరుగులిచ్చి, 3 వికెట్లు తీయడం గొప్ప విషయమన్నాడు. గత ఏడాది 7వ స్థానంలో నిలిచాం, కనుక ఐపీఎల్ 2021కు పూర్తిగా సన్నద్ధమై వచ్చామని సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ తమ గేమ్ ప్లాన్ మారిందని వివరించాడు.

Also Read: Corona Cases: భారత్‌కు ప్రయాణాలు చేయవద్దని పౌరులను హెచ్చరించిన అమెరికా ప్రభుత్వం 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
IPL 2021: CSK Captain MS Dhoni doesnt want to be called unfit
News Source: 
Home Title: 

IPL 2021: ఫిట్‌నెస్ లేదని నాపై ఫిర్యాదులు రాలేదు, సంతోషం: ఎంఎస్ ధోనీ

IPL 2021: ఫిట్‌నెస్ లేదని నాపై ఫిర్యాదులు రాలేదు, సంతోషం: ఎంఎస్ ధోనీ
Caption: 
CSK skipper MS Dhoni (right) with Dwayne Bravo after the win over RR (Photo: BCCI/IPL)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
IPL 2021: ఫిట్‌నెస్ లేదని నాపై ఫిర్యాదులు రాలేదు, సంతోషం: ఎంఎస్ ధోనీ
Shankar Dukanam
Publish Later: 
No
Publish At: 
Tuesday, April 20, 2021 - 12:28
Request Count: 
60
Is Breaking News: 
No