Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 09, 2021 Rasi Phalalu, ఓ రాశివారి చేతికి ఆస్తి

Today Horoscope In Telugu 09 April 2021: ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి ఏప్రిల్ 09వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 9, 2021, 08:01 AM IST
Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 09, 2021 Rasi Phalalu, ఓ రాశివారి చేతికి ఆస్తి

Horoscope Today 09 April 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి ఏప్రిల్ 09వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

మేష రాశి
ప్రస్తుతానికి మీ కళ్ల ముందు జరుగుతున్న దాని కన్నా మీ వెనుక జరుగుతున్న విషయాలు కీలకంగా మారనున్నాయి. ఒకరికి సహాయపడటానికి మీరు శ్రమిస్తారు. అయితే ఇతరుల విజయంతో మునిగిపోకుండా, మీ కోసం ఏదైనా చేయడానికి ప్రయత్నించండి. పిల్లల ఆరోగ్యం ఈ రోజు ఒక సమస్య కానుంది. వ్యాపారులకు ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబంతో సరదాగా సమయం గడపనున్నారు. 

Also Read: Marriage Luck: ఈ రాశులలో జన్మించిన అమ్మాయిలకు పెళ్లి తరువాత సిరిసంపదలు, సుఖశాంతులు!

వృషభ రాశి
మీరు ఈ రోజు ఉత్సాహంగా మరియు చాలా పాజిటివ్ ఆలోచనలతో ఉన్నారు. మీ ముఖంపై చిరునవ్వు కనిపిస్తుంది. ఈ రోజు మీ కంపెనీని కొన్ని ఆఫర్లు వస్తాయి. కొంతకాలం నుంచి మీరు చేయని పనులను తిరిగి ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులకు ఆశించిన ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారులకు శ్రమకు తగ్గ ఫలితం అందుకుంటారు.

మిథున రాశి
ఈరోజు మీ పనులతో ప్రశంసలు పొందుతారు. మిమ్మల్ని ప్రేమిస్తున్న చాలా మంది మీ చుట్టూ ఉన్నారు. మీరు సైతం వారితో ప్రేమగా, ఆప్యాయతతో వ్యవహరించండి. మీ ఉన్నతాధికారులకు సమస్యను పరిష్కరించడంలో కొంత సహాయం అవసరం. మీరు కారు, ఏదైనా వాహనం కొనుగోలు చేయాలనుకుంటే ఈ రోజు తగిన సమయం. ఖర్చులు అధికం కానున్నాయి. తద్వారా రుణ యత్నాలు మొదలుపెడతారు. 

కర్కాటక రాశి 
చేపట్టిన కొన్ని పనులు మధ్యలోనే వాయిదా పడతాయి. కొన్ని విషయాలలో ఓపికగా వ్యవహరించాలి. అది మిమ్మల్ని ఎక్కడికి నడిపిస్తుందో చూడండి. ఈ రోజు మీ మనసు మాట వినండి, ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. అధికంగా శ్రమించాల్సి వస్తుంది. ఆలయాలు సందర్శించాలని భావిస్తారు. ఉద్యోగాలలో మార్పు కోరుకుంటారు.

Also Read: Kumbh Mela 2021 Photos: ఘనంగా ప్రారంభమైన హరిద్వార్ కుంభమేళా, ఫొటో గ్యాలరీ

సింహ రాశి
నేడు మీరు కేవలం విశ్రాంతి తీసుకోవాలని భావిస్తారు. అయితే మీ పని గురించి చాలా డిమాండ్ ఉంటుంది. కనుక వెంటనే పనులు మొదలుపెడతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఓ శుభవార్త అందుకుంటారు. చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న మీ ఆస్తి చేతికి దక్కనుంది. వ్యాపారులకు అంతంతమాత్రంగా ఉంటుంది. 

కన్య రాశి
ఈ రోజు కన్యారాశి వారు చాలా అసహనానికి గురవుతారు. మీరు అన్ని పనులను పూర్తి చేసి ప్రస్తుతం ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు. మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం చేయడం శ్రేయస్కరం. పనులు త్వరగా పూర్తి చేయకపోవడం వల్ల ఫలితం ఆలస్యం అవుతుంది. నేడు మీకు వాహనయోగం గోచరిస్తుంది. కొన్ని కార్యక్రమాలు, వేడుకలలో పాల్గొనేందుకు ఆహ్వానాలు అందుతాయి. 

తులా రాశి
మీరు సహోద్యోగి పట్ల ఆకర్షితులు అవుతారు. అయితే మనసు పెట్టి పని చేయకపోతే కీలక పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తమ బాగోగులు చూడాలని మీ తల్లిదండ్రులు కోరుకుంటారు. మీ ఆర్ధికవ్యవస్థ క్షీణిస్తుంది. అదనపు ఖర్చులు మానేయాలి. ఉద్యోగులు, వ్యాపారులకు ఆశించిన ఫలితాలు రావు. ప్రయాణాల కారణంగా ఖర్చులు అధికం కానున్నాయి. 

వృశ్చిక రాశి
ఈ రోజు వృశ్చిక రాశి వారు భావోద్వేగాలకు లోనవుతారు. అయితే దీన్ని మంచి విషయంగా తీసుకోండి. మీరు ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకుంటే, అందుకు నేడు చాలా మంచి రోజు. కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఖర్చులు అధికం కావడంతో రుణ యత్నాలు మొదలుపెడతారు. చేపట్టిన పనులలో జాప్యం తలెత్తుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

Also Read: ఈ 7 పదార్థాలు, వస్తువులు శివుడికి సమర్పించకూడదని తెలుసా

ధనుస్సు రాశి
మీరు కాస్త అలసటకు లోనవుతారు. పూర్తి శక్తితో పని చేయలేకపోతున్నానని నిరాశ చెందకండి. మీరు సాధారణంగా చాలా ఉత్సాహభరితంగా ఉంటారు. ఈ రోజు ఖచ్చితంగా ఏమీ చేయకుండా సరదాగా కాలక్షేపం చేయాలని భావిస్తారు. పని నుంచి కాస్త విరామం కోరుకుంటారు. ఉద్యోగులకు అనుకూల ఫలితాలు వస్తాయి. వ్యాపారాలకు లాభసాటిగా ఉండనుంది. దైవచింతన పెరగడంతో ఆలయాలు సందర్శిస్తారు.

మకర రాశి
మీరు అసలు ఊహించిన ఓ వ్యక్తి పట్ల ఆకర్షితులవుతారు. వారు కూడా మిమ్మల్ని ఇష్టపడతారు. అదే సమయంలో మీ ఉద్యోగంలో చాలా ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరియు మీరు చేస్తున్న అన్ని పనులకు మీకు క్రెడిట్ లభించకపోవచ్చు. మీ కోసం కొంత సమయం కేటాయించాలి. షాపింగ్‌లు చేయడంతో ఖర్చులు అధికం కానున్నాయి. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.

Also Read: COVID-19 Vaccination: కరోనా టీకాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఇది చదవండి

కుంభ రాశి
మీ కెరీర్ లక్ష్యాలకు సంబంధించి మీ మనస్సులో చాలా ఆలోచనలు ఉన్నాయి. మీ పనిలో కొత్తదాన్ని ఎంచుకోవాలని ఆలోచిస్తున్నారు. దానివల్ల మీకు మేలు చేకూరనుంది. అయితే, మీరు ఇప్పటికే చేస్తున్న పనులను సైతం మరిచిపోకూడదు. ప్రస్తుతం సాధించలేని లక్ష్యాల కోసం మీ ఉద్యోగాన్ని వదిలివేయవద్దు. మీ చేతికి ఆస్తి వస్తుంది. నూతన పరిచయాలతో మీకు మేలు జరుగుతుంది. వ్యాపారులకు సానుకూల ఫలితాలు వస్తాయి.

మీన రాశి
ఇతర వ్యక్తుల కోసం మీరు శ్రమిస్తారు. వారికి తోడుగా ఉండి సహకారం అందిస్తారు. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల కోసం ఏదైనా చేయడానికి మీరు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. తమ అవసరాల కోసం కొందరు మిమ్మల్ని సంప్రదిస్తుంటారు. కనుక మీరు ఎవరికి సహాయం చేస్తున్నారో చూసి చేయాలి. అధికంగా శ్రమించిన ఫలితాలు అందుకోలేరు. ఆర్థిక సమస్యల కారణంగా రుణాలు చేస్తారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News