/telugu/photo-gallery/actress-sri-reddy-apology-and-emotional-letter-to-former-cm-ys-jagan-family-pa-180817 Sri Reddy Letters: జగనన్న సారీ..  ఇలా అవుతుందను కోలేదు.. సంచలన లేఖ రాసిన నటి శ్రీరెడ్డి.. Sri Reddy Letters: జగనన్న సారీ.. ఇలా అవుతుందను కోలేదు.. సంచలన లేఖ రాసిన నటి శ్రీరెడ్డి.. 180817

Delhi Curfew: కరోనా వైరస్ పంజా విసురుతోంది. మహారాష్ట్ర తరువాత ఢిల్లీ, కర్నాటకల్లో పరిస్థితి తీవ్రంగా మారుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి చేయి దాటేలా కన్పిస్తోంది. ఫలితంగా రాత్రి పూట కర్ఫ్యూ విధించారు ఢిల్లీలో.

దేశ రాజధానిలో కరోనావైరస్ (Corona virus) చేయి దాటే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కర్నాటకతో సమానంగా కేసులు నమోదవుతున్నాయి, దాంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా కట్టడికి ఇవాళ్టి నుంచి ఢిల్లీలో రాత్రిపూట కర్ఫ్యూ( Night Curfew in Delhi) విధిస్తున్నట్టు ప్రకటించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 30 వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉండనుందని తెలిపింది. అనుమతులు లేకుండా బయటకు వచ్చేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తాజా ప్రకటనలో తెలిపింది. అయితే, అత్యవసరాలు, వాక్సినేషన్‌ ( Vaccination) కోసం ప్రయాణాలు చేసే వారికి ఈ- పాసులు జారీ చేస్తామని, కర్ఫ్యూ సమయంలో వారికి మాత్రం అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు. అదే విధంగా, జర్నలిస్టులు, ప్రైవేటు డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి అనుమతిస్తామని పేర్కొన్నారు.

ఢిల్లీలో గత 24 గంటల్లో 3 వేల 548 కరోనా కేసులు నమోదయ్యాయి. కేసుల్లో ఆరు శాతం పెరుగుదల కనిపించింది. సోమవారం ఒక్క రోజే 15 మంది చనిపోయారు. కరోనా మృతుల సంఖ్య కూడా పెరుగుతుండటంతో కట్టడి చర్యలకు కేజ్రీవాల్ ( Arvind kejriwal) సర్కార్ దిగింది. రాష్ట్రంలో ప్రస్తుతానికి లాక్‌డౌన్ ( Lockdown) విధించేది లేదని, అయితే రాత్రిపూట కర్ఫ్యూ మాత్రం అమల్లో ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీలో ఫోర్త్‌వేవ్ కొన‌సాగుతోంద‌ని, లాక్‌డౌన్‌పై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ఇటీవ‌లే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ప్ర‌జ‌ల నుంచి స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రించిన త‌ర్వాతే లాక్‌డౌన్‌పై నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు.

Also read: Tamilnadu Assembly Elections 2021: శశికళకు మరో షాక్..ఓటర్ల జాబితాలో పేరు గల్లంతు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Night curfew imposed in delhi as recorded highest number of covid cases
News Source: 
Home Title: 

Delhi Curfew: ఢిల్లీలో పెరుగుతున్న కేసులు, నైట్ కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం

Delhi Curfew: ఢిల్లీలో పెరుగుతున్న కేసులు, నైట్ కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం
Caption: 
Delhi night curfew ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Delhi Curfew: ఢిల్లీలో పెరుగుతున్న కేసులు, నైట్ కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Tuesday, April 6, 2021 - 15:11
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
39
Is Breaking News: 
No