Covid19 Virus: దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు

Covid19 Virus: దేశంలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా కొత్త కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మరోవైపు కొత్తగా మరణాల సంఖ్య కూడా పెరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 1, 2021, 10:51 AM IST
  • దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు
  • 2020 మార్చ్-ఏప్రిల్ సంక్రమణ వేగం కంటే ఎక్కువగా ఉందంటున్న నిపుణులు
  • గత 24 గంటల్లో 72 వేల కొత్త కేసులు దేశవ్యాప్తంగా నమోదు
Covid19 Virus: దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు

Covid19 Virus: దేశంలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా కొత్త కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మరోవైపు కొత్తగా మరణాల సంఖ్య కూడా పెరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

కరోనా వైరస్ మహమ్మారి (Coronavirus ) శరవేగంగా విస్తరిస్తోంది. గత యేడాది  అంటే 2020 మార్చ్ -ఏప్రిల్ నెలలో సంక్రమణ వేగం ఎలా ఉందో ఇంచు మించు అలానే ఉంటోంది. నిన్నమొన్నటి వరకూ దేశవ్యాప్తంగా రోజుకు 30-40 వేల కొత్త కేసులు నమోదయ్యేవి. ఇప్పుడా సంఖ్య ఏకంగా 70 వేలకు పెరిగిపోయింది. గత 24 గంటల్లో అత్యధికంగా 72 వేల 330 కోవిడ్ 19 కేసులు ( Covid19 cases spike) నమోదయ్యాయి. అటు మరణాల సంఖ్య కూడా భారీగానే నమోదైంది.  24 గంటల వ్యవధిలో 459 మంది దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా మృతి చెందారు. 

ఇక 40 వేల 382 మంది కోలుకుని ఆసుపత్రుల్నించి డిశ్చార్చ్ అయ్యారు. రెండోదశలో  దేశంలోని మహారాష్ట్ర, కర్నాటక, ఢిల్లీ, ఛత్తీస్ గఢ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. మహారాష్ట్ర(Maharashtra)లో పరిస్థితి తీవ్రంగా ఉంది. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1 కోటి 22 లక్షల 21 వేల 665కు చేరుకోగా..మరణాల సంఖ్య 1 లక్షా 62 వేల 927గా ఉంది. అటు కోలుకున్నవారి సంఖ్య 1 కోటి 14 లక్షల 74 వేల 683గా ఉంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 5 లక్షల 84 వేల 55 ఉన్నాయి. ఇంకోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. దేశంలో ఇప్పటివరకూ 6 కోట్ల 51 లక్షల 17 వేల 896 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఇవాళ్టి నుంచి 45 ఏళ్లు పైబడినవారందరికీ వ్యాక్సినేషన్(Vaccination)ఇవ్వనున్నారు. 

Also read: Fact Check: నందిగ్రామ్‌లో మమతా బెనర్జీ ఓడిపోతుందా..ఏది నిజం, సర్వే ఎవరిది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News