GVMC: గ్రేటర్ విశాఖపట్నం కార్పొరేషన్లో విషాదం చోటుచేసుకుంది. గెలిచి..పదవి అనుభవించేలోగా మరణం వాకిట్లోకి వచ్చేసింది. విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్ ఆకస్మికంగా మృతి చెందారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నిక(Municipal Elections) ల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. గ్రేటర్ విశాఖపట్నం కార్పొరేషన్(GVMC)ను కైవసం చేసుకుంది. ఇప్పుడీ కార్పొరేషన్లో విషాదం చోటుచేసుకుంది. నగరంలోని 61వ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా గెలిచిన దాడి సూర్య కుమారి(Suryakumari) గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. సరిగ్గా నాలుగు రోజుల క్రితమే అంటే ఈ నెల 18 వ తేదీన కార్పొరేటర్(Corporator)గా ప్రమాణ స్వీకారం చేశారు. హఠాత్తుగా మరణించడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యుల కన్నీరు తీర్చలేనిదిగా ఉంది. ఆమె నివాసముంటున్న విశాఖ పారిశ్రామిక వాడ విషాదంలో నిండిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Also read: AP Municipal Elections: రాష్ట్రంలో మరోసారి మున్సిపల్ ఎన్నికల సమరం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook