Andhra pradesh: విశాఖ మేయర్‌గా వెంకటకుమారి, విజయవాడ మేయర్‌గా భాగ్యలక్ష్మి ఎన్నిక

Andhra pradesh: ఏపీలో 11 కార్పొరేషన్లు, 75 మునిసిపాలిటీల కొత్త పాలక మండలి ప్రమాణ స్వీకారం జరుగుతోంది. విశాఖ మేయర్‌గా వెంకటకుమారి ఎన్నిక కాగా..విజయవాడ మేయర్‌గా భాగ్యలక్ష్మి ఎన్నికయ్యారు. మేయర్-డిప్యూటీ మేయర్. ఛైర్మన్-వైస్ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియ కొనసాగుతోంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 18, 2021, 01:51 PM IST
Andhra pradesh: విశాఖ మేయర్‌గా వెంకటకుమారి, విజయవాడ మేయర్‌గా భాగ్యలక్ష్మి ఎన్నిక

Andhra pradesh: ఏపీలో 11 కార్పొరేషన్లు, 75 మునిసిపాలిటీల కొత్త పాలక మండలి ప్రమాణ స్వీకారం జరుగుతోంది. విశాఖ మేయర్‌గా వెంకటకుమారి ఎన్నిక కాగా..విజయవాడ మేయర్‌గా భాగ్యలక్ష్మి ఎన్నికయ్యారు. మేయర్-డిప్యూటీ మేయర్. ఛైర్మన్-వైస్ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియ కొనసాగుతోంది.

ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌ల కొత్త పాలక మండళ్లు (New councils) ఏర్పడుతున్నాయి. మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక పూర్తికావస్తోంది. ఏలూరు మినహా 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు  పాలకవర్గాలు ఏర్పడ్డాయి. గ్రేటర్ విశాఖపట్నం మేయర్( Visakha Mayor)‌గా గొలగాని హరి వెంకటకుమారి, డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ ఎన్నికయ్యారు. అటు విజయవాడ మేయర్ ( Vijayawada mayor) ‌గా భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా బెల్లం దుర్గం ఎన్నికయ్యారు. గుంటురు మేయర్‌గా కావటి మనోహర్ నాయుడు , డిప్యూటీ మేయర్‌గా వనమా బాలవజ్ర ఎన్నికయ్యారు. తిరుపతి మేయర్‌గా డాక్టర్ శిరీష్ ఎన్నికయ్యారు. అనంతపురం మేయర్‌గా వసీం సలీమ్ ఎన్నికయ్యారు. చిత్తూరు మేయర్‌గా అముద, డిప్యూటీ మేయర్‌గా చంద్రశేఖర్ ఎన్నికయ్యారు. 

ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు నగరపాలక సంస్థల్లో ఇద్దరు డిప్యూటీ మేయర్లు, మున్సిపాలిటీల్లో ఇద్దరు వైస్ ఛైర్మన్లను ప్రభుత్వం నియమించనుంది. దీనికోసం ప్రత్యేక ఆర్డినెన్స్ ( Special Ordinance) రూపొందించి ఆమోదం కోసం గవర్నర్‌కు పంపింది.  ఆర్డినెన్స్ ఆమోదం లభించాక మరో డిప్యూటీ మేయర్, వైస్ ఛైర్మన్  పదవుల ఎన్నికకు ఎన్నికల సంఘం మరో నోటిఫికేషన్ జారీ చేయనుంది. 

Also read: Covid19 tests: కరోనా పరీక్షలు, వ్యాక్సినేషన్‌పై దృష్టి పెట్టిన ఏపీ ప్రభుత్వం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News