Ap Mlc Elections: ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అయిన ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్దులకు ముఖ్యమంత్రి జగన్ బీఫామ్‌లు అందించారు. ఎమ్మెల్సీగా అవకాశమిచ్చినందుకు జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు కలిసి..భీఫామ్ పత్రాల్ని తీసుకున్నారు. ఆరుగురు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఇవాళ నామినేషన్లు వేయనున్నారు. 5 సాధారణ ఖాళీలు, ఒక స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. ఈ ఆరు స్థానాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులుగా ఇక్బాల్, కరీమున్నీసా, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, చల్లా భగీరథ, దువ్వాడ శ్రీనివాస్, సి.రామచంద్రయ్యలను పార్టీ ఎంపిక చేసింది. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో బడుగు, బలహీన వర్గాలకు వైఎస్సార్ సీపీ ప్రాధాన్యం కల్పించింది. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో ఆయన కుమారుడు బల్లి కళ్యాణ చక్రవర్తికి ఎస్సీ సామాజిక వర్గం కింద ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. అదేవిధంగా ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి మరణంతో ఖాళీ అయిన స్థానంలో ఆయన కుటుంబానికే తిరిగి అవకాశమిచ్చారు.
ముందు చెప్పినట్టే..చల్లా రామకృష్ణారెడ్డి కుమారుడు చల్లా భగీరథరెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్ధిగా అవకాశం కల్పించారు. మరోవైపు మైనారిటీ వర్గానికి ప్రాధాన్యమిచ్చారు. ఆ వర్గానికి చెందిన కరీమున్నీసా, మహ్మద్ ఇక్బాల్‌లను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేశారు. హిందూపురం సమన్వయకర్త ఇక్బాల్ గత ఎన్నికల్లో ఓటమి చెందారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న ఆయనకు రెండోసారి అవకాశం కల్పించారు. శ్రీకాకుళం ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓడిన దువ్వాడ శ్రీనివాస్‌కు న్యాయం చేయాలని పార్టీ నిర్ణయించింది. బీసీ కోటా కింద ఆయనను ఖరారు చేసింది. ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా తమకు అవకాశమిచ్చినందుకు వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Also read: Ap municipal elections: ఊహించిందే జరిగింది..ఏకగ్రీవాల్లో వైసీపీ హవా: సజ్జల రామకృష్ణారెడ్డి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook